భూత్పూర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతతో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి ఆదరణ పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateswar Reddy) అన్నారు. ఆదివారం వరంగల్ ఎల్కతుర్తి లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ( Silver Jublee ) నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భూత్పూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ( BRS Flag ) ఆవిష్కరించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్థరహితంగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో 14 ఏళ్లు చేసిన పోరాటాన్ని, అధికారంలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వ్యవహారాన్ని, ఏడాదిన్నరగా ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలబడిన తీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.
ఎల్కతుర్తి లో నిర్వహిస్తున్న సభకు ప్రజలు అనుకున్న దానికంటే రెండింతలుగా ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల్లో కేసీఆర్ సార్ చూడాలని, ఆయన స్పీచ్ ను వినాలని ఎంతోమంది ఆశతో ఈ సభకు తరలి వస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ ఎంపీపీలు సత్తూర్ చంద్రశేఖర్ గౌడ్, రాచూరి చంద్రమౌళి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణ గౌడ్, నర్సింలు గౌడ్, మనమోని సత్యనారాయణ, వెంకటయ్య, ఫసియోద్దీన్, బీఆర్ఎస్ మండల నాయకులు సాయిలు, వెంకట రాములు, నరసింహారెడ్డి, ఆల శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.