వనపర్తి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : వనపర్తి అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వాహనంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో తాను ప్రజల తీర్పును శిరసావహిస్తానని విలేకరుల సమావేశంలో సింగిరెడ్డి చెప్పారు. అనంతరం కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో గేటు బయట కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న తలంపుతో కాంగ్రెస్‌కు చెందిన మూకలు దాడికి పాల్పడ్డాయి. చేతులతోనే అద్దాలను గుద్దడం.. కర్రలతో దాడికి పాల్పడగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఊహించని ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అల్లరి మూకలను అదుపు చేసి సింగిరెడ్డి వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే సింగిరెడ్డి కారుపై దాడి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో దాడులకు పా ల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని ధర్నాకు ఉపక్రమించారు. అయితే ప్రశాంతంగా ఉండే వనపర్తిలో లేని సంస్కృతికి కాం గ్రెస్ తెరలేపిందని, ఎప్పుడు వనపర్తిలో ఇలాంటి వాతావరణం లేదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
ఇలాగే కాం గ్రెస్ అరాచకాలకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ నా యకులు హెచ్చరించారు. కాంగ్రెస్ సం స్కృతి దాడుల సంస్కృతి అయితే తా ము ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. ధర్నా సందర్భంగా వనపర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాల సం దర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కాం గ్రెస్ మూక లు ఏకంగా సింగిరెడ్డి వాహనంపైనే దాడి చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు ధర్నాను ఉపసంహరించాలని ప్రయత్నించినప్పటికీ నాయకులు అంగీకరించలేదు. చివరకు డీఎస్పీ ఆనందరెడ్డి దా డికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళనను ఉపసంహరించారు. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో పట్టణంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఆందోళన కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ చైర్మన్ పలుస రమేశ్ గౌడ్, నాయకులు పాకనాటి కృష్ణ, మహేశ్, నాగన్నయాదవ్, అనురాధ, కవిత తదితరులు పాల్గొన్నారు.