భూత్పూర్, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ గూటికి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో భారీగా చేరా రు. అడ్డాకుల మండలం పొన్నకల్ మాజీ ఎంపీటీసీ వెంకట్రాములుతోపాటు వడ్డె వెంకటయ్య, వడ్డె నాగరాజు, వడ్డె బాలస్వామి, వడ్డె శ్రీకాంత్, పెద్ద అంజన్న, వడ్డె కృష్ణ, మహేశ్, చిన్న, బాలకృష్ణ, నవీన్, మన్యంకొండ, వెంకటేశ్, సాయిలు, కురుమూర్తి, కావలి శివ చేరిన వారిలో ఉన్నారు.
అలాగే భూత్పూర్ మండలం హస్నాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎర్ర మన్యం, ఆంజనేయరెడ్డి, మూసాపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన బీజేపీ నాయకులు రామకృష్ణ, శివకుమార్, సురేష్, రెడ్డి వెంకటేశ్, కే.శివకుమార్, పరశురాం కారెక్కారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఆల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని పోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమిష్టిగా కృషి చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీపార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పొన్నకల్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మహమూద్, రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.