మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. మం త్రి జూపల్లి కృష్ణారావు చైర్మన్ ఎంపికలో తన రాజకీయ ప్రత్యర్థులకు పట్టం కట్టడం చర్చనీయాంశంగా మారింది. 13మంది డైరెక్టర్లున్న డీసీసీబీ చైర్మన్ ఎంపికకు 11 మంది హాజరయ్యారు. వీరంతా బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన వారే. వారంతా కలిసి కొల్లాపూర్‌కు చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
మరోవైపు వైస్ చైర్మన్ పదవి కూడా ఇస్తామంటూ ప్రలోభాలకు దిగారు. కాగా, చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలో డీసీసీబీ చైర్మన్ పదవి కూడా పోతే పరువు పోతుందని భావించి మంత్రి, ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ నేతలకు భారీ ఆఫర్లు ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ, బీజేపీ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దీంతో పరోక్ష ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపి డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య డీసీసీబీ చైర్మన్‌గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాన్‌గల్ సింగిల్ విండో, డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. నాలుగున్నరేండ్ల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకొని డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకున్నది. చైర్మన్‌గా ఉన్న నిజాంపాషా అనారోగ్యానికి గురికావడంతో ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మ న్ ఎంపిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మెజార్టీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా కుయుక్తులు పన్నారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు విష్ణువర్ధన్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో సంబంధిత అధికారులు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మొత్తం 13మంది డైరెక్టర్లు ఉండగా, ఇద్దరు డైరెక్టర్లు మినహాయించి 11 మంది ఎన్నికలకు హాజరయ్యారు. చైర్మన్‌గా ఎంపికైన విష్ణువర్ధన్‌రెడ్డిని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అభినందించారు.
డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో వైస్ చైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై స్పష్టత రాలేదు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వడంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ డైరెక్టర్‌కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నా రు. త్వరలో 12మంది డైరెక్టర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చే రగానే వైస్ చైర్మన్ పదవిని ఒకరికి కట్టబెట్టి వచ్చే ఎన్నికల్లో కూడా వారికే ప్రాధాన్యమిచ్చేలా ఒప్పం దం కుదిరింది. మరోవైపు మిగతా డైరెక్టర్లకు నచ్చజెప్పి పార్టీ ఆదేశానుసారం ఎన్నికకు సహకరించిన వారందరికీ భవిష్యత్తులో పదవులు ఇస్తామని ఆశ చూపా రు. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని దాదాపు పదేండ్ల తర్వాత కాంగ్రెస్ మెజార్టీ లేకుండా కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది.