వనపర్తి టౌన్, జూలై 18 : కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని శుక్రవారం ప్రకటనలో తీవ్రంగా ఖం డించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చా వు భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. పాలమూరును వలసల పాలు చే సిందే దశాబ్దాల కాంగ్రెస్ పాలన అని, గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో వలసల జిల్లాకే ఉపాధి కోసం వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుంచి తిరిగి వలసలు మొదలయ్యాయని అన్నారు.
2014 వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు అం దించి 13వేల ఎకరాలకు మాత్రమే, కాం గ్రెస్ అంటే పెండింగ్ అని, కేసీఆర్ అంటే రన్నింగ్ అని, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించింది కేసీఆర్ అని గుర్తు చేశారు. జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన ఘన త బీఆర్ఎస్ పార్టీదని, కల్వకుర్తి ఎత్తిపోతల కింద దాదాపు 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది కూడా బీఆర్ఎస్ పార్టీయేని , 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 19 నెలలుగా పడా వు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నా రు. పూర్తయిన టెండర్లను రద్దు చేసి వందల కోట్ల అదనపు భారం మోపుతున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదని, కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పా పాన పోలేదని అన్నారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి గత 19 నెలలలోతట్టెడు మన్ను ఎత్తిన పాపాన పోలేదని, ఒక్కసారి కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల మీద సమీక్ష చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తన మామ స్వర్గీయ సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్నందుకైనా దాని పనులు వేగవంతం అవుతాయని అనుకున్నామ ని.. పేరు పెట్టి ఏడు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేదన్నారు. మే నెలలో కృష్ణా నదికి వరద మొదలైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు ఆన్ చేయకుండా 45రోజులు కాంగ్రెస్ ప్ర భుత్వం మీనమేషాలు లెక్కించిందని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సగం చెరువులు, కుంటలు నిండేవన్నారు.
కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని, రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అ న్నారు. అభివృద్ధి చేసేందుకు వచ్చిన బం గారం లాంటి అవకాశాన్ని రేవంత్‌రెడ్డి తన చర్యలను వ్యతిరేకించిన వారి మీద పగ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడన్నారు. రాజకీయాల్లో ఎందరో ని యంతలు నేలకూలారు… వారి సరసన భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి చేరడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక నేత సీఎం రేవంత్‌రెడ్డి అని అన్నారు.