ఎమ్మెల్యే అండ.. కుంట కబ్జా !
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉండడంతో ఈ కుంట చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మండల కేంద్రం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే రహదారికి ఆనుకొని ఉండడంతో గజం భూమి దాదాపు రూ.10 వేలు పలుకుతోంది.
- రాత్రికి రాత్రే హిటాచీతో కుంట కట్ట ధ్వంసం
- ప్లాట్లుగా మార్చి రూ.కోట్ల విలువైన భూమి స్వాహాకు ప్రయత్నాలు
- భారీ స్కెచ్ వేసిన స్థానిక కాంగ్రెస్ నేతలు
- సొంత పార్టీ నేతలపై గ్రామ సర్పంచ్ ఫిర్యాదు
- పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ
‘రియల్’ దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉండడంతో ఈ కుంట చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మండల కేంద్రం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే రహదారికి ఆనుకొని ఉండడంతో గజం భూమి దాదాపు రూ.10 వేలు పలుకుతోంది.
దీంతో కాంగ్రెస్ నేతల కన్ను ఈ కుంటకు చెందిన 17 ఎకరాలపై పడింది. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు రింగ్‌గా ఏర్పడి కుంట పక్కన ఉన్న భూములను కొనుగోలు చేసి కుంటలు కూడా వారి ఖాతాలో కలుపుకొని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు వాటాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. రూ.కోట్ల విలువ చేసే ఈ కుంటను కబ్జా చేయడానికి పూనుకోవడంతో మండల కేంద్రం ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కుంటలను సైతం మింగేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, మార్చి 21 : అసలే అధికార పార్టీ నేత లు.. ఆపై ఎమ్మెల్యే అండదండలు.. ఇంకేముంది.. రూ.కోట్లు విలువ చేసే కుంట కబ్జాకు దర్జాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన రహదారికి కూతవేట దూరంలో ఉన్న కుంటను చదును చేసి ప్లా ట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ దందాకు తెర లేపారు. అర్ధరాత్రి హిటాచీ తీసుకొచ్చి కిలోమీటర మేర ధ్వంసం చేశారు. ఈ కుంట పై భాగం, కింది భాగం లో మరో రెండు కుంటలకు గొలుసుకట్టుగా వానకాలంలో నీరు నిల్వ ఉంటాయి.
ఈ కుంట చుట్టుపక్కల ఉన్న పట్టా భూములను ఆసరాగా చేసుకొని కోట్లు విలువ చేసే శిఖం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్ నేతలపైనే ఆ పార్టీకి చెందిన సర్పంచ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ కుంటను కాంగ్రెస్ నేతల కబ్జా నుంచి కాపాడాలని బీఆర్ఎస్ నేతలు ఇటు కలెక్టర్‌కు, అటు తాసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కుం టను నామరూపాలు లేకుండా చేసి ప్లాట్లుగా చేసి విక్రయించాలనుకున్న వారిపై ఇప్పటి వరకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జుట్టయ్య కుంట కబ్జాకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాత్రికి రాత్రి కుంటకట్టను చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. దీంతో బిజినేపల్లి సర్పంచ్ రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుతో కలకలం మొదలైంది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే అండదండలతో బిజినేపల్లి మండ ల కేంద్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు ఏకంగా కుంటలు మాయం చేసే పనిలో పడ్డారు. అయితే సొంత పార్టీకి చెందిన సర్పంచ్ అధి కారులకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నేతల బండారం బట్టబయలైంది.
కుంట చుట్టూ పట్టా భూములు..
బిజినేపల్లి మండల కేంద్రంలో మహబూబ్‌నగర్‌కు వెళ్లే దారిలో 458 సర్వే నెంబర్లో జుట్టయ్య కుంట ఉన్నది. ఈ సర్వే నెంబర్ మొత్తం 41.06 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. ఇవన్నీ పట్టా భూములు. ఈ భూములను ఆనుకొని మధ్యలో జుట్టయ్య కుంట 17.10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. రెవెన్యూ రికార్డుల్లో ఇది శిఖం భూమిగా అధికారులే నిర్ధారించారు. దీనికి గొలుసుకట్టుగా మూడు కుంటలు ఉన్నాయి. ఈ కుంటకు పై భాగంలో కొరివయ్య కుంట, కింది భాగంలో మొద్దులకుంట ఉన్నాయి.
వానకాలం వస్తే ఈ కుంటలన్నీ నిండి చుట్టుపక్కల పొలాలకు నీళ్లు పారడంతోపాటు భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఈ కుంట 1996లో వరదల కారణంగా కట్ట తెగిపోయింది. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ నిధులతో కుంటకట్ట మరమ్మతులు చేపట్టారు. ఈ కుంటకట్ట సుమారు కిలోమీటర్ పొడవు ఉంటుంది. బిజినేపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం 11 చెరువులు, కుంట లు ఉన్నాయి. వీటికి సంబంధించి 414 ఎకరాల 4 గుంటల శిఖం భూమి కలదు.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఫిర్యాదుతో..
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే అండదండలతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో బిజినేపల్లికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు కుమ్మక్కైనట్లు సమాచారం. 17 ఎకరాల జుట్టయ్య కుంటను కబ్జా చేసేందుకు భారీ స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే కట్టను ధ్వంసం చేసి జేసీబీతో మొత్తం చదువు చేసి ప్లాట్లుగా మార్చాలనుకున్నారు. అయితే సదరు పార్టీకి చెందిన రెబల్ సర్పంచ్ ఈ కబ్జా వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశా డు.
ఎట్టి పరిస్థితుల్లో కుంటను కబ్జా నుంచి కాపాడాలని కోరడంతో విషయం బయటపడింది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాం తాల్లో భూములన్ని ప్లాట్లుగా మారిపోయాయి. అక్రమంగా కుంట కట్టను తొలగించి ఆ స్థలంలో ప్లాట్లు చేసి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో బిజినేపల్లి బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్‌కు, రెవెన్యూ అధికారికి, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం మేల్కొని కుంటను కబ్జా నుంచి కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని.. సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కుంట కబ్జా భాగవ తం మొదలైన దగ్గర నుంచి
స్థానిక తాసీల్దార్ మండల కేంద్రానికి రాకపోవడం ప లు అనుమానాలకు తావిస్తోంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

