వనపర్తి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుంది. సోమవారం పెబ్బేరు మండలం పాతపల్లికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చైతన్య భారతి ఆధ్వర్యంలో 50మంది వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాతపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా చైతన్య భారతిని పాతపల్లి గ్రామస్తుల అభిప్రాయం మేరకు సింగిరెడ్డి ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పాతపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా తోడ్పాటు అందించామన్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సహకారమందిస్తానని చెప్పారు. ఐకమత్యంగా భారతిని గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామంలో పనులు లేక అభివృద్ధి మాటే లేదన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు అశోక్, రమేశ్, రాము, వెంకటయ్య, గోవిందు, నాగే శ్, కరుణాకర్, శ్రీనివాసులు, ఆశన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట, నవంబర్ 1 : బుద్ధారానికి చెందిన తా జా మాజీ ఎంపీటీసీ అర్రు శ్రీదేవి భర్త విష్ణువర్ధన్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వీరికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువా కప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు తిరుపతి యాదవ్, కృష్ణారావు, వెంకటయ్య, జాంప్లా నాయ క్, శేఖర్‌గౌడ్, కృష్ణయ్య, లాలు నాయక్, రాజు, అశోక్, లచ్చగౌడ్, రాందాస్ నాయక్ ఉన్నారు.