పాన్‌గల్, డిసెంబర్ 1 : మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసగిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే కేటీఆర్‌పై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ కలిసే కేటీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని, వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధాకర్‌యాదవ్, గ్రామపార్టీ అధ్యక్షుడు వెంకట్రాములు, మాజీ సర్పంచ్ బాలస్వామి, నాయకులు ధనుంజయ్‌రెడ్డి, ధర్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజారెడ్డి, ఖాదర్, భాస్కర్‌చారి, ముం త రాముయాదవ్, బాలచంద్రుడు, జంపయ్యయాదవ్, స్వామి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.