కొల్లాపూర్ రూరల్ నవంబర్ 24 : పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో జరిన అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయి. కాం గ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్సు తప్పా మరొకటి అమలు కావడం లేదన్నారు.
రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఎంతో మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని తీవ్ర నష్టాల పాలు అవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే మంత్రులు ,ఎమ్మెల్యేలు వర్షాలకు మొక్కజొన్న ధాన్యం తడిసి బోరున విలపిస్తున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పూర్తిగా రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందన్నారు.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ వర్గ నాయకులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతుంది. నాయకులను టార్గెట్ చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని ప్రజల దృష్టి మరల్చడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమంగా పార్ములా ఈ కారు రేసు కేసును పెట్టి జైలు పంపడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, దీనిని రాష్ట్ర ప్రజలు గమినిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపేట సింగిల్ విండో అధ్యక్షుడు కట్ట రాజేందర్‌గౌడ్, కుడికిల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్‌రావు. తీర్నాంపల్లి పార్టీ నాయకులు, పెద్దకొత్తపల్లి మండల నాయకులు పాల్గొన్నారు.