పాలమూరు, మే 13 : మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు.
కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అదేవిధంగా ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సహకరించాలని లేదంటే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.