రైతుకు భరోసా ఏదీ?
అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతు న్న వేళ పెట్టుబడుల కోసం దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నది.
- ప్రారంభమైన వానకాలం సాగు
- పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు
- అందని పెట్టుబడి సాయం
- అన్నదాతలకు దళారులే దిక్కు
- అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న కర్షకులు
గద్వాల, జూన్ 7 : అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతు న్న వేళ పెట్టుబడుల కోసం దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో ఈ ఏడాది 4,35,252 ఎకరాల్లో వివి ధ పం ట లు సాగు చేస్తారని వ్యవసాయ అధికారు లు అంచనా వేశారు. ఈ ఏడాది జిల్లా లో పత్తి, వరి పంటలే రైతులు అ ధికం గా సాగు చేస్తున్నారు.
అయి తే ప్రస్తుతం రైతులు విత్తనాలు విత్తే సమయంలో ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం నానా అవస్థలు పడుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. రైతులు ఎకరా సాగు చేయడానికి సాగు ఖర్చు లు, పెట్టుబడులు మొత్తం కలుపుకొంటే రూ.40వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతులకు పెట్టుబ డి సాయం అందజేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ప్రభుత్వం మే చివరి నాటికి అందరికీ రైతు భరోసా వేస్తామని గొప్పలు పలికినా ప్రభుత్వం రెండు ఎకరాలతో సరిపెట్టి మమా అనిపించడంతో ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.
రైతులకు దళారులే దిక్కు..
కాంగ్రెస్ పాలనలో రైతుల పెట్టుబడికి దళారులే దిక్కయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.10వేల చొప్పున పంపిణీ చేసింది. ఏటా సీజన్ ప్రారంభం కాగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేయడంతో రైతులు తమకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకొని సిద్ధంగా ఉంచుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి(రెండు పంటలు) రూ.12వే లు మాత్రమే ఇచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం జిల్లాలో నామ మాత్రంగా మారడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం దళారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనిని అవకాశంగా భావించిన దళారులు రైతుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. దళారులు రైతులు పంట మొదలు అప్పులు ఇచ్చి పంట చేతికి వచ్చిన నాలుగు నెలల తర్వాత రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
గతంలో రైతు బంధు వస్తుందనే నమ్మకంతో దుకాణాదారు లు రైతులకు ఎరువులు, విత్తనాలు ఉద్దెర ఇచ్చేవారు. ప్ర స్తుతం రైతు భరోసా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చే యకపోవడంతో దుకాణాదారులు ఉద్దెర ఇవ్వడం లేదని రై తులు వాపోతున్నారు. జిల్లాలో 1,87,841 మంది రైతులు ఉన్నారు. వీరు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోగా అం దులో 1,74,350 మంది రైతుల ఖాతాలు రైతు భరోసా కోసం కాగా మిగతా రైతుల ఖాతాలు వివిధ కారణాలతో ని లిచి పోయాయి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
రైతు భరోసా వెంటనే ఇవ్వాలి
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటసాగు కు ముందే రైతుబంధు పైసలు వచ్చేవి, ఇప్పుడు రావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు సీజన్ల పైసలు ఎగ్గొట్టిం ది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పైసలు ఇవ్వకపోవడంతో అప్పు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అప్పుల కోసం దళారుల వద్దకు వెళ్తే షరతులు విధించి అప్పులు ఇస్తున్నారు. మా లాంటి పేద రైతుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి.
– దరెన్న, రైతు, ఈడ్గోనిపల్లి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

