మహబూబ్‌నగర్ ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్దఎత్తున ధా న్యం చేరడంతో ఆరు బయటనే కుప్పలుగా పోస్తున్నారు. రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనాల్సిన సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది. మరోవైపు ఈదురు గాలులు.. అకాల వర్షాలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేల టన్నుల ధాన్యం కొనుగోలు లేక ఎక్కడికి అక్కడే ఆగిపోయా యి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించినా ఒక్క కిలో ధాన్యం కూ డా కొనలేదు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి లో అత్యధికంగా ధాన్యం దిగుబడి వచ్చినా 12వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతుంది. సర్కారు కొనకపోవడంతో బహిరంగ మార్కెట్లో అమ్ముదామంటే మద్దతు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం సన్నబియ్యానికి రూ. 2,300 మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ. 500 బోనస్‌గా చెల్లిస్తోంది. అయితే బహిరంగ మా ర్కెట్లో మాత్రం సన్నబియ్యానికి అత్యధిక ధర రూ.2000 కాగా కనిష్ఠంగా రూ.1800 మాత్రమే ఇస్తామని వ్యాపారులు అంటున్నారు.
రైతులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశతో కేం ద్రాలకు భారీగా తరలిస్తున్నారు. ఆశించిన స్థాయి లో కొనుగోలు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నా రు. మరోవైపు అకాల వర్షాలు ఈదురు గాలులు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో వారం రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నా యి. కొన్నిచోట్ల ధాన్యం కోతకు వచ్చిన దశలో వడగండ్లు పడి నష్టం సంభవిస్తుండగా.. మరోవైపు కొ నుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవుతుంది. ఇటు సర్కారు కొనకపోవడం అటు ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పలకరించే దిక్కు లేక రైతులు గోసపడుతున్నారు.
లక్ష్యం 3.40లక్షల మెట్రిక్ టన్నులు..
వనపర్తి జిల్లాలో మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 481 కాగా ఇందులో 379 కేంద్రాలు ప్రారంభించారు. యాసంగి ధాన్యం కొనుగోలు ల క్ష్యం 3.40 లక్షల టన్నులు కాగా ఇప్పటి వరకు 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పెద్దమందడి మండలంలో ఓ రైతు 4000 బస్తాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లగా లారీలు లేవని నేపంతో అలాగే నిలిపివేశారు. ఇక గద్వాల జిల్లాలో మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు 69కాగా ఇప్పటివరకు రెండే కేంద్రాల ప్రారంభించారు. యాసంగి ధాన్యం కొనుగోలు లక్ష్యం 1,75,000 టన్నులు అయితే 200 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..కేవలం 7,782 టన్నులు మాత్రమే కొనుగో లు చేశారు. యాసంగి అంచనా ధాన్యం 1,76, 525 మెట్రిక్ టన్నులుగా ఉంది. నారాయణపేట జిల్లాలో 97 కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించగా . యాసంగి ధాన్యం కొనుగోలు లక్ష్యం 1,50,000 మెట్రిక్ టన్నులు కాగా కేవలం 12వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టపడి పండించిన సన్నబియానికి.. దొడ్డు బియ్యానికి బహిరంగ మా ర్కెట్లో దళారులు కుమ్మకై తక్కువ ధరలను నిర్ణయించారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు తీసుకెళ్లిన ధాన్యానికి మద్ద తు ధర కూడా రావడం లేదు. సర్కారు సన్నబియానికి మద్దతు ధర ఇచ్చి రూ.500 బోనస్ వ స్తుందని ఆశతో తీసుకెళ్లిన కొనుగోలు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కనిష్ఠ ధర క్వింటాకు రూ.1800 కాగా గరిష్ఠ ధర రూ.2.200 పలుకుతోంది. ప్రభు త్వం మాత్రం సన్నబియానికి రూ.2,300 మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో సర్కార్ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. కానీ కొనుగోలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోని రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది దీని కంతటికి సర్కారు నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి అకాల వర్షాలు దడ పుట్టిస్తున్నాయి. బోరు బావుల కింద విద్యుత్ కోతలు అధిగమించి రైతులు పంటలను కాపాడుకొని వాటిని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమశాతం అంటూ కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి అమ్ముకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు మాని ధాన్యం కుప్పల వద్ద కళ్లు కాయలు కాసుకొని ఎప్పుడు కొంటారని ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రకృతి కూడా అన్నదాతలపై పగబట్టింది. వారంరోజుల నుంచి అకాల వర్షాలు, వడగండ్ల్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఏడుగురు పిడుగుపాటుకు గురై చనిపోగా అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లకు తెచ్చిన ధాన్యం వర్షార్పణం అవుతుంది. మరికొన్ని చోట్ల పొలంలోనే ఉండగానే వడగండ్లు పడి గింజలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రమే జరుగుతుండడంతో రైతులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోవైపు తడిసిన ధాన్యం కూడా కొనాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు గింజ కూడా కొనకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 234 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పటివరకు 210 కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు జరగకపోవడం తో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే జిల్లాలో ఈ యాసంగిలో కొనుగోలు చేయాల్సిన ధాన్యం 1,89,239 మెట్రిక్ టన్నులు అని అంచనా వేయగా ఇప్పటివరకు కొనుగోళ్లే ప్రారంభం కాకపోవడం గమనార్హం.
నారాయణపేట, ఏప్రిల్ 21 : నారాయణపేట జిల్లా కేంద్రం లో సోమవారం సాయం త్రం అరగంట పాటు ఈదురు గా లులతో కురిసిన భారీ వర్షాని కి వ్యవసాయ మారెట్ యా ర్డులోని 3వేల బస్తాల ధాన్యం సంచులు తడిచిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులు తమ ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారుల నుంచి ఖరీదుదారులు ధాన్యం కొనుగోలు చేసేందుకు టెండర్లు కూ డా వేశారు. విషయం తెలుసుకున్న మారెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి మారెట్ యార్డుకు చేరుకొని ఈరోజు పలికిన ధరకే రేపు ఖరీదు దారులు తడిచిన ధ్యాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు చేసేందుకు ఒప్పించా రు. కాగా వర్షం వచ్చే సమయంలో టార్ఫాలిన్లను కప్పినా పెద్దఎత్తున వీచిన గాలులకు అవి ఎగిరిపోయి ధాన్యం తడిచిపోయింది.