వనపర్తి, జూన్ 23(నమస్తే తెలంగాణ) : వనపర్తికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పాన్‌గల్ రోడ్డు నుంచి కొత్తకోట రోడ్డు వరకు బైపాస్ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జీవో 366 ద్వారా రూ.73 కోట్లను మంజూ రు చేయించి టెండర్లను కూడా ఏర్పాటు చేయించినా పనులు ప్రారంభించలేదని పేర్కొన్నా రు. సోమవారం మాజీ మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టుయాదవ్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డుకు టెండర్లు పూర్తి చేసి కొంత ఫార్మెషన్ పనులు కూడా జరిగాయని, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన అనంతరం ఆ పనులను పూర్తి గా నిలిపివేసిందన్నారు.
ఇటీవలే గతంలో బైపాస్ రోడ్డు కోసం నిర్ణయించిన స్థలంలో ప్రస్తుతం మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారని, దీనివల్ల బైపాస్ రోడ్డును పూ ర్తిగా నిలిపి వేస్తున్నట్లు అర్థమవుతున్నదన్నారు. బైపాస్ రోడ్డు మార్గం ద్వారా గతం లో టీడీపీలో ఉండి ప్రస్తు తం కాంగ్రెస్‌లో ఉన్న నాయకుడికి చెందిన నాలుగు ఎకరాల పొలం రోడ్డు లో పోతుందని, ఈ నాయకుడికి మేలు చే యడం కోసం బైపాస్ రోడ్డును కొనసాగనీయకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్న ట్లు ఆ రోపించారు.
వనపర్తి చరిత్రలో విప్లవాత్మకం గా అభివృద్ధి పనులను మంజూరు చేయిస్తే, వాటిని అమలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్నారు. నిరంజన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందని, గతంలో మంజూరైన పనులన్నింటినీ పక్కకు పెట్టారని విమర్శించారు. నిధు లు ఉండి టెండర్ పూర్తయిన రింగ్ రోడ్డును ఓ నాయకుడి ప్రయోజనం కోసం ఆపుతారా అంటూ ప్రశ్నించా రు. దీని పై ఎమ్మెల్యే మేఘారెడ్డి సమాధానం చెప్పాలని, వెంటనే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించక పోతే.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని గట్టుయాదవ్ హె చ్చరించారు. సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, నందిమళ్ల రమేశ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.