వెల్దండ, అక్టోబర్ 12 : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్ట్టేందుకు 42శాతం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందన్నారు. రిజర్వేషన్లు అమలు కాని విషయం కాంగ్రెస్‌కు ముందే తెలుసనని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దొంగ నాటాకాలు ఆడుతుందన్నారు. ఈ నెల 14న బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ కల్వకురి నియోకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకా అసత్యాలు, అబద్ధాలతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు, బీసీలు కాంగ్రెస్ మోసాన్ని గమనించాలన్నారు. ఎక్కడికక్కడి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగులునాయక్, నిరంజన్, ఆనంద్, రాజునాయ క్, మాజీ ఎంపీటీసీ హన్మంతునాయక్, అశోక్, ప్రసాద్, గంగాదార్ తదితరులు ఉన్నారు.