కోడేరు, నవంబర్ 13 : ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చు టోపి పెట్దిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి విమర్శించారు. కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 40మంది నాయకులు గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీరం హర్షవర్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలో రాష్ట్రంలో 8లక్షల వివాహాలు జరిగాయని ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఎక్కడ ఎవరికి ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 420 హామీలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయని కొన్నిచోట్ల తాను టెండర్లు పూర్తి చేయించి శంకుస్థాపనలు చేసిన పనులను కూడా ఈ ప్రభుత్వం కొనసాగించకుండా పక్కన పెట్టిందన్నారు. కోడేరు మండలం బావాయిపల్లి వంతెన నిర్మాణం కోసం రూ.6 కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. కానీ ఇంత వరకు వంతెన నిర్మాణం పనులు మొదలు పెట్టలేద న్నారు. కోడేరు మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం రూ.1.75 కోట్లు మంజూరు చేయిస్తే ఈప్రభుత్వం అసమర్థతతో రెవెన్యూ కార్యాలయానికి సొంత భవనం నిర్మాణం చేపట్టలేకపోయిందని విమర్శించారు. సిం గోటం గోపల్‌దిన్నె లింక్ కెనాల్ నిర్మా కోసం రూ.130 కోట్లు మంజూరు చేయించగా ఈ టెండర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి వచ్చినట్లు గుర్తు చేశారు.
ఈ పనులన్నింటినీ ఉద్దేశ పూర్వకంగానే పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన హయాంలో నిధులను మంజూరు చేయించి తీసుకొచ్చిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోడేరు మండలం బావాయిపల్లి వంతెనతోపాటు కొల్లాపూర్ మండ లం రామాపురం పశువుల వాగు వంతెన నిర్మాణం టెండర్లను ఎందుకు క్యాన్సల్ చేయించారని చేతనైతే అభివృద్ధి చేయాలి కానీ వచ్చిన పనులను క్యాన్సల్ చేయించడం మంచి పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. కోడేరు మండలంలో అక్రమ మైనింగ్ చేస్తు న్న వారిపై కేసులు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. ఈ అక్రమ మైనింగ్ మాఫి యా వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండాప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాబోవు రోజులు మనవేనని అందరూ ధైర్యంగా ఉండాలని నాయకులు కార్యకర్తలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ కాటం జంబులయ్య, శివారెడ్డి, బద్దల శేఖర్‌యాదవ్, శ్రీశైలం, బొందయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ లింగస్వామి, భాస్కర్‌రెడ్డి, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
కోడేరు మండల పరిధిలోని జనుంపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల కు చెందిన సుమారు 40 మంది నాయకు లు, కార్యకర్తలు గురువారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనుంపల్లికి చెందిన శివ, శివుడు, గాలయ్య, క్రుష్ణ, తిరుపతయ్య, స్వామి, క్రుష్ణయ్య, ఎర్రోళ్ల రాములు, అంకె కృష్ణయ్య, అంకె నాగేంద్రం, వెంకటస్వామి, రాముడు, బొక్కశేషయ్య, రవీందర్‌రెడ్డి, శేష య్య, దడుమయ్య, స్వామి, పసుపుల శేష య్య,చంద్రయ్య, మద్దిటి, కుమ్మరి శ్రీనివాసులు, కోడేరులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటనారాయణ తదితరులు బీఆర్ఎస్లో చేరగా మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.