మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మూసాపేట : మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట్ తాసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా లీడర్ శెట్టిశేఖర్పై చర్యలు తీసుకోవాలని శనివా రం రెవెన్యూ ఉద్యోగులు మూసాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. కాంగ్రెస్ నాయకుడైన శెట్టిశేఖర్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అధ్యక్షతన యూనియన్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్, వరప్రసాద్, శ్రీనివాసులు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దేవేందర్, భూత్పూర్ యూనిట్ అధ్యక్షుడు రవికుమార్ లింగంతోపాటు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మూసాపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన శెట్టిశేఖర్పై చర్య తీసుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించా రు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.