తొలగని గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. పట్టణంతోపాటు పల్లెల వినియోగదారులు వేకువజాము నుంచే పడిగాపులు కాశారు.
- ఏజెన్సీల వద్ద కస్టమర్ల పడిగాపులు
- ఓటీపీ ఉన్న వారికే సిలిండర్లు ఇస్తున్న వైనం
- సిలిండర్ల సరఫరా పెంచాలని డిమాండ్
అయిజ/కొల్లాపూర్ టౌన్, మార్చి 25 : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు. పట్టణంతోపాటు పల్లెల వినియోగదారులు వేకువజాము నుంచే పడిగాపులు కాశారు.
కంపెనీలు సిలిండర్లను డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓటీపీ వచ్చిన కస్టమర్లకు సిలిండర్లు పంపిణీ చేయాలంటే కంపెనీలు సిలిండర్ల సరఫరాను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎన్నాళిలా సిలిండర్ల కోసం అష్టకష్టాలు పడాలని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. సరిపడా లేక హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లతోపాటు చాయ్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బందులు పడ్తున్నారు. వంట వండేందుకు పడరాని పాట్లు పడుతుండగా.. కొందరు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జీషాన్ రెస్టారెంట్ నిర్వాహకులు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిని నమ్ముకున్నారు. ఐదు రోజులుగా వంట చెరుకుతో వంట వండుతున్నారు.
– తాహేర్, ఫొటోగ్రాఫర్-నారాయణపేట
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

