మహబూబ్ నగర్ కలెక్టరేట్, జూన్ 16 : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. రెవెన్యూ సదస్సుల లో భాగంగా సోమవారం ఆమె జడ్చర్ల మండలం, పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు .భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్టప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అందువల్ల వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.