మూసాపేట, ఆగస్టు 31 : వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివా రం అడ్డాకుల మండలంలోని వర్నె బ్రిడ్జి వద్ద ఎక్కువగా వరద రావడం తెలుసుకొని ఆమె బ్రిడ్జి వద్దకు వచ్చి పరిశీలించా రు. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ బ్రిడ్జిలను పరిశీలించారు. వర్షా లు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎ ప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తాసీల్దార్ మదన్మోహన్గౌడ్, అధికారులు, పాల్గొన్నారు.
మహబూబ్నగర్ కలెక్టరేట్, ఆగస్టు 31: రానున్న రెండ్రోజులు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వా తావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శనివారం జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నం.08542-241165) ఏర్పా టు చేశామన్నారు. ఇది 24గంటలు పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ: సా ధారణ తనిఖీల్లో భాగంగా పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గోదామును కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.