జోగులాంబ గద్వాల : గద్వాల నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలంలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సంతోష్ (Collector Santosh) , ఎస్పీ శ్రీనివాసరావు ( SP Srinivas Rao ) ఆదివారం పరిశీలించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ( Panchayat Elections ) సందర్భంగా ఇద్దరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఎన్నికలు సజావుగా కొనసాగుతుందో లేదో తెలుసుకుని, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఏజెంట్లు ఓటర్లకు స్లిప్లు అందజేసి పోలింగ్ బూత్ల వివరాలను అందజేశారు.