బీఆర్ఎస్పై నిర్బంధకాండ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి పడావు పెట్టినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
- ఎక్కడికక్కడ నేతల అరెస్టులు
- సీఎం పర్యటనలో హడావుడి
- ముఖ్యమంత్రి, కోటరీ, మంత్రులకు వేర్వేరుగా హెలికాప్టర్ల ఏర్పాటు
- తీవ్ర ఇక్కట్లు పడిన జనం..మీడియాపై ఆంక్షలు
- సోమశిలలో సమీక్ష..
- సమీక్ష మధ్య నుంచే వెళ్లిపోయిన రేవంత్‌రెడ్డి
- చిత్తశుద్ధి లేదన్న బీఆర్ఎస్
మహబూబ్‌నగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి పడావు పెట్టినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. కాలు కింద పెట్టకుండా హెలికాప్టర్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చక్కర్లు కొట్టడంతో జనం విస్తూ పోయారు. ప్రాజెక్టులపై సమీక్ష కంటే హెలికాప్టర్లో గాల్లో పోటీలు అంటే బాగుంటుందని జనం గుసగుసలాడుతున్నారు. మరోవైపు రేవంత్ కలల ప్రాజెక్టు అయిన కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకంపై కూడా కొద్దిసేపు మాత్రమే సమీక్షించడం ఉన్నతాధికారులు పవర్ ప్రజెంటేషన్ ద్వారా చెబుతూ ఉండగానే లేచి వెళ్లిపోయారు. ఇక గద్వాల జిల్లా గుడ్డెందొడ్డి ప్రాజెక్టులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
కర్ణాటకకు చెందిన మంత్రిని వెంటవేసుకొచ్చి హడావిడి చేయడం తప్పా చిత్తశుద్ధితో ప్రాజెక్టులపై సమీక్ష చేయకపోవడం కనీసం ఏం జరుగుతుందో చూడకపోవడం విడ్డూరమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు సీఎం పర్యటిస్తున్న నేపద్యంలో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని, గద్వాలలో పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు తోపాటు అనేకమంది నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. సీఎంను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారని తీసుకువచ్చిన రైతులను కూడా పోలీసులు గద్వాలలో అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
ఆధ్యంతం భద్రత పేరుతో పోలీసు యం త్రాంగం హడావుడి చేసింది. కేవలం ప్రజాప్రతినిధులు తప్పితే ఎవరినీ కల్వకుండా ఏరియల్ వ్యూకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం రెండున్నర గంటల్లోనే కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.. భీమా ఫేస్-1.. కృష్ణ భీమా నదులపై చేపట్టే బ్రిడ్జి కం బ్యారేజీలు.. జూరాల డాం సైట్.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.. గుర్రందొడ్డి రిజర్వాయర్లపై ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించా రు. ఇదంతా కేవలం రెండున్నర గంటల్లోనే జరిగిపోయింది. చివరకు కొల్లాపూర్ మండ లం సోమశిల రిసార్ట్‌లో ముఖ్యమంత్రి, మంత్రులకు హైటెక్ బస ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసుల హడావుడి మాత్రమే కనిపించింది.
గద్వాలలో రైతుల అరెస్ట్..
ఉమ్మడి జిల్లాలోని గద్వాల నియోజకవర్గం లో జూరాల బ్యాక్ వాటర్ సోర్స్‌గా చేపడుతున్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పనులను రైతాంగం అడ్డుకుంటుంది. దీంతో ఇది పెండింగ్‌లో పడింది. ఈ రిజర్వాయర్ నిర్మిస్తే భూములు కోల్పోవడమే కాకుండా ఇల్లు జనావాసాలు ఊ ర్లు సైతం మునుగుతున్నాయని ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అ యితే ముఖ్యమంత్రి వస్తున్నాడని తెలుసు కొని రైతుల ప్రతినిధి బృందం గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌పై వివరించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పోలీసు అధికారులతో పాటు ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇచ్చి సీఎంను కలువడానికి ప్రయత్నించారు. విచిత్రమేమో కానీ సీ ఎంను కలవడానికి వచ్చిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఘటన సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం
ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతుండగా తొలిరోజు మొత్తం గద్వాల ని యోజకవర్గంలో కొనసాగింది. ఈ రెండు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు, మరికొందరిని అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించి సీఎం వెళ్లిపోయాక వీరిని వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా సాగునీటి ప్రాజెక్టులపై సలహాలు తీసుకోవాల్సింది పోయి ఇలా గృహ నిర్బంధంలోకి ఉంచ డం సమంజసం కాదని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం ఉన్నంతసేపు దాదాపు గంటపాటు రాకపోకలు నిలిపివేశారు. రోడ్లపై కర్ఫ్యూ అవతారం కనిపించి. సీఎం వస్తున్న గంట ముందు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన ఇంటి వద్ద పోలీస్ అధికారులు భారీ ఎత్తున మొహరించారు. ఇక గద్వాలలో కూడా పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడును కూడా గృహనిర్బంధంలోకి ఉంచి మిగతా నేతలను కూడా అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మీడియాపైనా ఆంక్షలు
ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటనకు మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలు ఇతర కారణాలను చెబుతూ మీడియాను లోపలికి అనుమతించలేదు. కేవలం పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ద్వారా లైవ్ కవరేజీ ఫొటోలు పంపిస్తామని కబురు పంపారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి మీడియా వస్తుంది కాబట్టి ఉమ్మడి జి ల్లా మీడియాకు మరి న్ని ఆంక్షలు విధించి కొంతమందిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించడం కోసమెరుపు. సమీక్ష జరుగుతున్న తీరును కవరేజ్ చేయాల్సి ఉండగా లోపలికి అనుమతించలేదు.. ముందుగా పాసు లు ఇస్తున్నామని చెప్పి తర్వాత పోలీసు యంత్రాంగం వద్దని చెప్పిందని నిరాకరించారు. మొత్తంపైన ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని నేత లపై నిర్బంధాలు, అరెస్టులు మధ్య ప్రాజెక్టులపై రేవంత్‌రెడ్డి సమీ క్ష కొనసాగడంపై జనం అసహనం వ్యక్తం చేశారు.
గాల్లోకి హెలికాప్టర్ల రేస్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి నేరుగా హెలిక్యాప్టర్లోకి వచ్చారు. అయితే భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి మరికొందరు మంత్రులు వేరే హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మక్తల్ చేరుకున్నారు. ఈ రెండు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ గాల్లో రేసింగ్ నిర్వ హించినట్లు కనిపించింది. కేవలం హడావిడిగా ఏరియల్ వ్యూ పేరుతో ప్రజాధనం వృథా చేశారని జనం మండిపడుతున్నారు. మక్తల్ నుంచి నేరుగా గద్వాలలోని గుడ్డెందొడ్డికి వెళ్లారు. అక్కడ కూడా ఐదు పది నిమిషాల్లోనే కార్యక్రమం ముగించుకొని తిరిగి సోమశిలకు పయనమయ్యారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

