Lakshma Reddy | కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరణ శాసనం రాస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మొన్న కర్ణాటకలో జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీక్రెట్ సమావేశంలో ఈ ప్లాన్ చేశారన్నారు. బుధవారం మాజీ మంత్రులు వీ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతినిధి బృందం ఆర్డీఎస్ ప్రాజెక్టును సందర్శించింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలి.. అందుకే RDS ప్రాజెక్టు నుండి కర్ణాటక రాష్ట్రం నీళ్లు తీసుకపోతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం చలనం లేకుండా చూస్తూ కూర్చుందని.. దీని వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉందని మండిపడ్డారు. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరమే లేదని.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వీళ్లు చూపిస్తున్న ఆయకట్టుకు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లు ఇవ్వచ్చునని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
పనికిరాని కొడంగల్ ప్రాజెక్టు NOC కోసం మొత్తం పాలమూరు జిల్లా రైతుల కడుపు కొడుతున్న పాలమూరు ద్రోహి రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. తుంగభద్రపై కర్ణాటక – ఆంధ్ర రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నాదొంగ నిద్ర నటిస్తూ మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాను రేవంత్ రెడ్డి ఎడారిగా మారుస్తున్నాడని ధ్వజమెత్తారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరణ శాసనం రాస్తున్నారు
మొన్న కర్ణాటకలో జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీక్రెట్ సమావేశంలో ఈ ప్లాన్ చేశారు
కర్ణాటక రాష్ట్రం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలి, అందుకే RDS ప్రాజెక్టు నుండి… https://t.co/LRxjPenMP8 pic.twitter.com/OF4rhWvMsj
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026