BRS Party | మహబూబ్ నగర్ మండలం కోడూరు వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు ప్రగతికి కేసీఆర్ అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలోనే లేడని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా కొంటా కొంటానని 15 రోజుల కిందట అన్నవ్ కదా రేవంత్‌రెడ్డి.. ఇవాళ ఏమైంది మరి అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ఎంత కొనమంటే అంతే కొంటారని రేవంత్ రెడ్డి అనడం సరికాదని.. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రతి గింజా కొన్నారని, వడ్లు, జొన్నలు, మక్కలు అన్నీ కొన్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేశారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు యూరియా సమస్య లేదని, ఆటో అన్నకు ఒక్క ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేదని, ఇప్పుడు కాంగ్రెస్ యాప్ తీసుకొచ్చి రైతన్నలను ఆగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అసలు షాప్‌లోనే యూరియా లేకపోతే యాప్‌లో నుంచి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
వరి సాగుకు రైతులు సిద్ధం అవుతుంటే dap లేదని అంటున్నారని.. ఇతర పంటలు వేసిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారని సకాలంలో యూరియా లేక పంటల్లో మొక్కలు ఎదగడం లేదని అన్నారు. రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు డీఏపీ.. యూరియా అందుబాటులో ఉంచడంతోపాటు రైతు భీమా.. భరోసా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, పార్టీ మండలం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మా ఎంపీపీ సుధ, pacs చైర్మన్ రాజేశ్వరరెడ్డి, సీనిర్ నాయకులు రాజగోపాల్ యాదవ్, రాఘవ వేందర్, అల్లావుద్దీన్, చెన్నయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.