నారాయణపేట, నవంబర్ 6: దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలు వస్తే చాలు తిమ్మిని బమ్మిని చేసినట్లు లేనిపోని మాటలు చెప్పేవాళ్లు వస్తుంటారని, ఎన్నికలన్న తర్వాత అన్ని పార్టీల అభ్యర్థులు ఉంటారని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థుల గుణగణాలు బేరీజు వేసుకోవాలని, వారి వెనుకాల ఉండే పార్టీలు ఇంత వరకు ఏం చేశాయి, ఏ చేస్తారో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఓటు ఐదేండ్ల భవిష్యత్తు, తలరాతను మారుస్తుందని, ఓటు ఒక వజ్రాయుధం వంటిదని చెప్పారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
హైదరాబాద్ తర్వాత ఏర్పడిన తొలి మున్సిపాలిటీగా నారాయణపేటకు చరిత్ర ఉందన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎంతో తెలివైనవాడని, జిల్లా చేయించుకురావడం జరిగిందని, అదేవిధంగా మెడికల్ కాలేజీ, నర్సింగ్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో నారాయణపేటకు ఎన్నో సార్లు వచ్చి సభలు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఆనా డు వలసల జిల్లాగా ఉండిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారన్నా రు. కాంగ్రెస్ చరిత్ర చాలా ఉందని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే 7మంది విద్యార్థులను చంపివేశారని ఆనాటి నుంచి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణ మ్యానిఫెస్టో తయారు చేసే సమయంలో మూడు నాలుగు నెలలు మెదడ్లను కరగబెట్టి ఆర్థిక నిపుణులతో చర్చించి ఎట్లా ముందుకు వెళ్లాలో ఆలోచించామన్నారు. 40, 70, 200 పింఛన్ ఇవ్వడం చూశామని, పింఛన్లు ఎందుకు ఇస్తున్నామని మ్యానిఫెస్టో తయారు చేసే వారిని అడగడం జరిగిందన్నారు. విధివంచితులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రెండు పూటల తిండి తినడానికి పింఛన్ విధానాన్ని రూ.1000 తో మొదలు పెట్టామన్నారు. ఆ తర్వాత 2016 పెంచడం జరిగిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను మొదట్లో రూ.50వేలు ఆ తర్వాత రూ. 1,00116కు పెంచడం జరిగిందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రూ. 3,016 పెంచడం జరుగుతుందన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాడు కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం కృషి చేసి ఉంటే నేడు దళితుల దుస్థితి ఈ విధంగా ఉండేది కాదన్నారు. ఆనాడు రాజేందర్‌ను గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన రెండు మూడు నెలల్లోనే జిల్లా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కృషితో రోడ్డు వెడల్పు, డివైడర్లు, పార్కులు ఇతర అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని 196 కేసులు వేయడం జరిగిందని, దేవుడి దయవల్ల అన్ని కేసులు కొట్టి వేయ డం జరిగిందన్నారు. 8 నెలల్లో కాల్వల ద్వారా నీరు తీసుకువస్తామన్నారు. కాన్కుర్తి వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు లక్షల ఎకరాల పంటలు పండాలని కోరుకుంటున్నానన్నా రు. ఎమ్మెల్యే కోరిన అన్ని కోరికలకు ఎన్నికల తర్వాత జీవోలు విడుదల చేస్తానన్నారు. ప్రజల మధ్య అడిగారు, ప్రజల మధ్యనే ప్రకటిస్తున్నాని స్పష్టం చేశారు. తన కంటే దొడ్డు, ఎత్తు ఉన్న ముఖ్యమంత్రులు ఉండేవారని, జిల్లాను దత్తత తీసుకున్న వాళ్లు ఉన్నారన్నారు. కానీ ఏనాడు జిల్లా బాగుకోసం పాటు పడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
మొదట్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణ పేరు ఎత్తడానికి కూడా సాహసం చేసేవారు కాదన్నారు. కానీ 2004లో ఉద్యమం ఉవ్వెత్తున పెరగడంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అణగదొక్కి పెట్టేందుకు ప్రయత్నించిందన్నారు. ప్రజల ఒత్తిడితో తెలంగాణ ఇచ్చారే తప్పా నిజంగా అభిమానంతో ఇవ్వలేదన్నారు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి జనం వచ్చి తమ బాధలను చెబుతున్నారని తెలిపారు. కర్ణాటకలో 5గంటల కరెంట్ ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శివకుమార్ ఇక్కడకు వచ్చి ప్రకటించి పోయారన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చి రైతుబంధు వద్దంటున్నారని, రేవంత్‌రెడ్డి 3గంటల కరెంట్ ఇవ్వాలని చెబుతున్నారన్నారు. రైతుబంధు, 24గంటల కరెంటు వంటి తెలంగాణ సంక్షేమ పథకాలు కావాలంటే తిరిగి రాజేందర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో కూడా 24గంటల కరెంటు లేదన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీస్తామంటున్నారని తెలిపా రు. ధరణి తీయాలా, వద్దా అని ప్రజలను ఉద్దేశిం చి ప్రశ్నించారు. ధరణితో రైతుల చేతులోనే భూ మిని మార్చే శక్తి ఉందన్నారు. హైదరాబాద్‌లో అకౌంట్లో వేస్తే రైతుల అకౌంట్లలో రైతుబంధు, వడ్ల కొనుగోలు డబ్బులు వచ్చి చేరుతాయన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి రాజ్యం వస్తుందని, ప్రజలా రా తస్మాత్ జాగ్రత్త అని తెలిపారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు తెలంగాణలో సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి ముస్లింలు రాజేందర్‌రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలన్నా రు. ఏడాదిలోపు కాల్వలను పూర్తి చేసి సాగు నీ రందిస్తామని, అదే విధంగా ఎమ్మెల్యే కోరిన వా టన్నంటినీ తీరుస్తామని సీఎం హామీ ఇచ్చారు.
* సాయంత్రం 5:40గంటలకు సీఎం కేసీఆర్ హెలిప్యాడ్‌లో జిల్లా కేంద్రానికి వచ్చారు.
* సాయంత్రం 5:45నిమిషాలకు సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
* 27 నిమిషాల పాటు ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
* ఆకట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రసంగం
* సభకు ఊహించని రీతిలో తరలివచ్చిన జనం
* ప్రజా ఆశీర్వాద సభ 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా ఓపికతో జనం వేచి చూశారు.
* సభలో ఏపూరి సోమన్న పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
* సభ కారణంగా పేట రోడ్లలో కిలోమీటర్ల పొడవున నిలిచిన ట్రాఫిక్.
దేవరకద్రలో మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ప్రారంభం కావలసిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాదసభ హెల్ప్యాడ్ లోపం వల్ల మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.
* 3:38 గంటలకు హెలిప్యాడ్‌లో సీఎం కేసీఆర్ దేవరకద్రకు చేరుకున్నారు.
*3:45 నిమిషాలకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం సభాస్థలికి చేరుకున్నారు.
* సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు.
*3:50 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభం
* 4:02 గంటలకు సీఎం ప్రసంగం ముగింపు
* 4:03 గంటలకు కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్తోపాటు పలువురు నాయకులను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
* 4:05 గంటలకు సీఎంకు కేసీఆర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
* 4:10 గంటలకు హెలిప్యాడ్‌లో సీఎం కేసీఆర్ బయలుదేరివెళ్లారు.
* సాయంత్రం 4:24 గంటలకు సీఎం కేసీఆర్ గద్వాలకు చేరిక
* హర్షద్వానాల మధ్యం సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన గద్వాల ప్రజానీకం
* 4 గంటల పాటు ఓపికతో కూర్చున్న గద్వాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ..
సీఎం కేసీఆర్
* ఆట, పాటలతో ఉత్తేజ పర్చిన కళాజాత బృందం
* ఆట, పాటలకు స్టెప్పులు వేసిన మహిళలు, పురుషులు
* 23 నిమిషాల పాటు ఆకట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రసంగం
* జోగుళాంబ అమ్మవారి పేరు ఎత్తగానే సీఎం కేసీఆర్‌ను అభినందించిన ప్రజలు
* గద్వాల విద్వత్ గద్వాలగా ప్రసిద్ధి
* నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో నూతన ఉత్తేజం..
* 4:52 గంటలకు మక్తల్ పర్యటనకు బయలు దేరిన సీఎం కేసీఆర్
మక్తల్‌టౌన్,నవంబర్ 6: మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా మక్తల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
* సాయంత్రం 5:08 గంటలకు సీఎం కేసీఆర్ హెల్ప్యాడ్ ల్యాండ్ అయ్యింది
* 5:11 నిమిషాలకు సీఎం ప్రజాఆశీర్వాదసభ ప్రాంగణానికి చేరుకున్నారు.
* ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దంపతులు సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు.
* సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకోగానే దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ కార్యకర్తలు కేరింతలు కొట్టసాగారు.
* 5:20 గంటలకు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.
* రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, పార్టీలను చూసి ఓటును వేయాలని, మంచి చెడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు.
* 5:27 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
* అనంతరం అక్కడి నుంచి హెలిప్యాడ్‌లో నారాయణపేట సభకు తరలివెళ్లారు.