కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆ దరిస్తే ఇప్పుడు ఉన్న దానికంటే రె ట్టింపు అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం, రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వ ర్గాల ప్రజల కష్టాలు తీర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. గతంలో ఉన్న తాగునీటి కష్టాలను గుర్తు తెచ్చుకుంటే.. ఎవరికి ఓటేయాలో స్పష్టత వస్తుందన్నారు. ఒకవేళ పొరపాటున కాం గ్రెస్‌కు ఓటేస్తే సమస్యలన్నీ మన వెంటే ఉంటాయన్నారు. గ్రామాల్లో కి వచ్చే హస్తం పార్టీ నేతలతో ఏం అభివృద్ధి చేసి ఓట్లడిగేందుకు వ స్తున్నారో నిలదీయాలని సూచించారు. రూ.కోట్ల అభివృద్ధి పనులు, రహదారులు, కంపెనీల రాకతో మహబూబ్‌నగర్ జి ల్లా రూపురేఖలు మార్చామన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి చెరువులు, కుంటలు నింపి ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామన్నారు. నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
పాలమూరు, నవంబర్ 17 : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే టూరిస్టులు కాంగ్రెస్, బీజేపీ నాయకులని, వారిని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కోడూరు, అప్పాయిపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల్లో మంత్రికి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటి కోసం పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుంటే ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య తీరిందన్నారు. 55ఏండ్లు పాలించి పాలమూరును ఎడారి చేశారని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి అన్ని చెరువులు, కుంటలు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాలరాజు, శ్రీధర్, ఊశన్న, వెంకటేశ్, నాగరాజు, పి.వినోద్‌తోపాటు 30మందికి పైగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మరవీందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, బుచ్చన్నగౌడ్, వెంకటమ్మ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 16 : మహబూబ్‌నగర్ పట్టణ రూపురేఖలు మారుస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాల్సాహెబ్గుట్ట పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును అభివృద్ధి చేశామని, మహబూబ్‌నగర్‌కు ఇరువైపులా ఐటీపార్కు, బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హన్వాడలో ఫుడ్‌పార్క్, చిన్నదర్పల్లి వద్ద బైపాస్‌రోడ్డు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. శిల్పారామంలో వాటర్రైడింగ్, వేవ్పూల్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్, మార్కెట్, 1వ వార్డులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వార్డు నాయకులు, కౌన్సిలర్లు, మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, బీఆర్ఎస్కే జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకులు రమేశ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్/మెట్టుగడ్డ అర్బన్ 17 : మహబూబ్‌నగర్ లీగల్‌సెల్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో 100మంది న్యాయవాదులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.100కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ కోసం ఈ స్థాయిలో పనిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు న్యాయవాదులు తెలిపారు. అలాగే హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వార్డుమెంబర్ జావిద్‌పాషా, గులాబ్ మహమ్మద్, ఎండీ ఫారూఖ్, అజ్జుతోపాటు 50మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రముఖ వైద్యుడు ప్రవీణ్‌కుమార్, చంద్రశేఖర్, నాయకులు పి.లక్ష్మారెడ్డి, సీఐటీయూ నాయకుడు వర్థ గాలెన్న తదితరులు గులాబీ పార్టీలో చేరారు.