సజావుగా..
పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారం భ మయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వారి బంధువులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు.
- ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 232 కేంద్రాలు..
- 45,063 విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరు
పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వారి బంధువులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, స్కాడ్స్ తనిఖీ చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అరగంట ముం దు నుంచే అనుమతించారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఉపాధ్యాయులు తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి, పరీక్షా సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. అలాగే సమీపంలోని జిరాక్స్ సెంటర్లు అన్ని బంద్ చేశారు. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు విద్యాధికారులు వెల్లడించారు. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన కురుమ హన్మంతు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మరణించినా బాధను దిగమింగుకొని అతడి కుమారుడు అజయ్ పరీక్షకు హాజరయ్యా రు. అలాగే శ్రీరంగాపూర్ మండలకేంద్రంలోని పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 18
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

