మక్తల్, జూలై 16 : కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మండలం కర్ని గ్రామ శివారులోని పొలంలో వరి నాట్లు వేస్తున్న కూలీలు, రైతులతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడగా వారు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
వ్యవసాయం చేయాలంటే రైతులు నా నా ఇబ్బందులు ఎదురోవడంతోపాటు ఒక మడి పారాలంటే బోరు మోటర్ దగ్గర నిద్రాహారాలు మాని వేచి ఉండాల్సిన పరిస్థితి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వరి సాగు చేస్తున్న రైతు యూరియా కోసం పడరాని పా ట్లు పడాల్సి వస్తోందని, యూరియా యాప్‌లో యూరియా దొరకడం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్లం కాదన్నారు. రైతులను రాజులాగా చూసిన మహరాజును కాదనుకొని రేవంత్‌రెడ్డిని ఎన్నుకుంటే రైతులు రక్తంతో పంటలు పండించుకోవాలని అంటున్నాడని వాపోయా రు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించేందుకు ఎప్పటికప్పుడు చొరవ చూపే వారని, ప్రస్తుతం ఉన్న మంత్రిని నీళ్లు అడగడానికి పోతే మిమ్మల్ని పంటలు ఎవరు వేసుకోమని చెప్పారని రైతులపైనే మం డిపడుతున్నారని, పరిస్థితులు ఇలాగే ఉంటే రైతుకు చావే శరణ్యం అయ్యేలా ఉందని రైతు లు విలపించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రైతన్నలకు మనో ధైర్యాన్ని ఇచ్చి వారిని ఓదార్చారు. త్వరలోనే రైతులు సంతోషపడే రోజులు వస్తాయని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పటిలాగే రైతులు పంటలు సంతోషంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని అంత వరకు కష్టాలు తప్పవని వివరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచులు గాల్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, వీరారెడ్డి, సురేశ్, ఆంజనేయులు గౌడ్, నాయకులు న ర్సింహారెడ్డి, జుట్ల సాగర్, నేతాజీరెడ్డి, ఈశ్వర్‌యాదవ్, అమ్రేష్, శివారెడ్డి పాల్గొన్నారు.