కత్తులతో దాడి చేస్తారా?
అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలోని బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులును శుక్రవారం పరామర్శించారు.
- కాంగ్రెస్ కబ్జాలను అడ్డుకుంటే ..
- దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్
అమరచింత, జూన్ 26: అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలోని బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులును శుక్రవారం పరామర్శించారు.
ముందుగా ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధితుడిని తీసుకెళ్లి దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్సై జయన్నతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి ఇంటి స్థలాలుగా మార్చి ఇతరులకు విక్రయించే క్రమంలో అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ సర్పంచ్ చిన్ననర్సింహులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయచూరు పరమేశ్ తమ కార్యకర్తలను ఊసగొలిపి కత్తులు, కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య అన్నారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులకు ఆత్మకూర్ సీఐ శివకుమార్ వత్తాసు పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వ స్థలం కబ్జా చేశారని ఘటనా స్థలానికి వెళ్తే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుందని, కబ్జాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి చేసిన వారిని ఇప్పుటి వరకు అరెస్టు చేయకపోవడంతో సీఐ మద్దతు ఉన్నట్ల్లు అర్థం అవుతుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చినా తాను ఊరుకోనని, ఎంతటివారినైనా వదిలిపెట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రవికుమార్యాదవ్, బంగారు శ్రీనివాసులు, వీరేశలింగం, రియాజ్, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

