మక్తల్, మే 30 : వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పెద్ద శాపంగా మారిందని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారు లు ఒక వైపు, పోలీసులు మరో వైపు ఇబ్బందులు పెడుతున్నారని భూ నిర్వాసితులు శు క్రవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో గోడు వెల్లబోసుకున్నారు.
దీనిపై స్పం దించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ముందుగా రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే భూసేకరణ చేపట్టాలని, ఇందుకోసం రెవెన్యూ అధికారులు, పోలీసులను రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ముందుగా రైతులు కోరుతున్న నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ స్పష్టమైన హామీ ఇవ్వకుండా భూ సేకరణ చేపడితే ఎలా అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకానికి కృష్ణా బోర్డు నుంచి అనుమతులు రావాల్సి ఉందని, అనుమతులు వచ్చిన త ర్వాతే ఏ పనులు చేపట్టడానికైనా అధికారు లు ముందు వస్తే బాగుంటుందన్నారు.
రైతులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు వారి పొలాలకు వెళ్లరాదని పేర్కొన్నారు. రై తుల నిర్ణయాన్ని కాదని వారిని ఇబ్బందులు పాలు చేసినా, వారి నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూసినా బీఆర్ఎస్ రైతులతో కలిసి పోరాడుతుందని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేను కలిసి న వారిలో కాట్రేవుపల్లికి చెందిన రైతులు రా జు, శ్రీనివాస్‌గౌడ్, రవికుమార్‌తోపాటు ప లువురు రైతులు ఉన్నారు.