మక్తల్, ఏప్రిల్ 16 : వరంగల్‌లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణ సమీపంలో బుధవారం రజతోత్సవ సభకు సంబంధించి వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27వ తే దీన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. అనాదిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిం చి అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి చావుదాకా వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు ప్రజా సంక్షేమ పాలన అందించడమే కాకుండా తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిపినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ గులాబీ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 27న వరంగల్‌లో చేపట్టే రజతోత్సవ మహాసభకు మక్తల్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత కొత్త శ్రీనివాస్‌గుప్తా, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, పార్టీ పట్ట ణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, మాగనూరు మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శంకర్, న ర్సింహారెడ్డి, సాగర్, ఆనంద్ పాల్గొన్నారు.