మక్తల్, జనవరి 23 : త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్‌లోని మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ పోరాడి సా ధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే మక్తల్, అమరచింత, ఆత్మకూర్లు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని, అమరచింత, ఆత్మకూర్‌లో బీఆర్ఎస్ పాలకవర్గాలనే ప్రజలు ఎన్నుకున్నారని మక్తల్ పీఠాన్ని మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు కలిసి దక్కించుకున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల మాదిరే కాం గ్రెస్ పార్టీ ప్రజలకు మరోసారి మోసపూరిత హామీలను ఇచ్చిన మున్సిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైన అంశాలను ప్రజలకు వివరించి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ అభ్యర్థులే సర్పంచులుగా గెలుపొందారని దానిని స్ఫూర్తిగా తీసుకొని మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరా రు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్‌లో మంచి ప్రయార్టీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాలలో గెలుపొందిన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు.
మక్తల్ మున్సిపాలిటీలోనే ఐదో వార్డులో బీసీ కాలనీకి చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి చిట్టెం సుచరితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, సుదర్శన్‌రెడ్డి, మక్తల్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, మాగనూర్, ఆత్మకూర్, అమరచింత మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, రమేశ్‌ముదిరాజ్, ఎల్లారెడ్డి, సర్పంచులు గాల్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, రవితేజ, వీరారెడ్డి, మా జీ కౌన్సిలర్లు, రాములు, మొగులప్ప, అన్వర్‌హుస్సేన్, నాయకులు జుట్ల శంకర్, మన్నాన్, రాజు పాల్గొన్నారు.