నారాయణపేట రూరల్, డిసెంబర్ 29 : మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ఈస్ట్ వెస్ట్ సీడ్స్ ప్రై లిమిటెడ్ ఆధ్వర్యంలో కూరగాయ ల పెంపకంపై ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు లు వరి పంటలను కాకుండా లాభదాయకమైన పంటల వై పు దృష్టి సారించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతుల బాగు కోసం రై తుబంధు, రైతుబీమతో పాటు మిషన్ కాకతీయతో చెరువు ల పూడికతీత పనులను చేపట్టడం జరిగిందన్నారు.
రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టి లాభాలు సాధించాలని సూచించారు. కేవలం 10 గుంటలో 18 రకాల కూరగాయ ల సాగు చేసి క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన కంపెనీ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. వీటి ని అన్ని మండలాల్లో ఏర్పాటు చే యాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ భీమయ్యగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, బీఆర్ఎస్ మండల కార్యదర్శ రవీందర్‌గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ రాము లు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వెంకట్రాములుగౌడ్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, ఎంపీటీసీ బాలమణి, కంపెనీ ప్రతినిధి ఆనంద, డీఏ వో, హార్టికల్చర్, ఏఈవో, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.