మాగనూరు, అక్టోబర్ 29 : మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు. మంగళవారం రైతులు బావకుల మారెప్ప, బుడ్డ మారెప్ప, మోనపురం నర్సింహ, దేవప్ప మాట్లాడు తూ మండలకేంద్రంలోని పెద్ద చెరువు కింద 329 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నామని, అయితే కాల్వల్లో తుంగ, పిచ్చి మొక్కలు మొలిచి సాగునీరుకు అడ్డుగా మారడం తో కాల్వల్లో పూడిక తీయాలని పలుమార్లు అధికారులను కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చేసేది లేక చెరువు కింద పంటలు సాగు చేసిన ప్ర తి రైతు రూ.వెయ్యి చొప్పున రూ.3,29,000తో పూడికతీత చేపట్టా మన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉన్నా.. పంటలు కాపాడుకోవడానికి మేమే సొంతంగా డబ్బులు వేసుకోవడం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ డీఈ సురేశ్‌ను వివరణ కోరగా.. రైతు లు సొంత నిధులతో కాల్వల పూడిక తీసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదని, సమస్య ఉంటే రైతులు మాకు వినతిపత్రం అందించినా ప్రభుత్వానికి పంపించి నిధులు మంజూరైన వెం టనే పనులు చేసే వారమని అన్నారు.