ప్రశాంతంగా బీసీ గురుకుల ప్రవేశపరీక్ష
మహబూబ్నగర్లో ఆదివారం 12 పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ సెట్ 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు.
- మహబూబ్నగర్ జిల్లాలో 2,755 మందికి గానూ 2,451 మంది విద్యార్థులు హాజరు
- నారాయణపేట జిల్లాలో 1008కి గానూ 893 మంది హాజరు
- రెండు జిల్లాల్లో 419 మంది గైర్హాజరు
పాలమూరు,ఏప్రిల్ 28 : మహబూబ్నగర్లో ఆదివారం 12 పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ సెట్ 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షను జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పర్యవేక్షించారు. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు 1,908 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకోగా 1,696 మంది హాజరయ్యారు. 212 మంది గైర్హాజరయ్యారు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు 847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 755 మంది హాజరుకాగా 92మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,755 మందికి 2,451 మంది హాజరు కాగా, 304మంది గైర్హాజరయ్యారు. 88.9 శాతం హాజరు నమోదైంది. కార్యక్రమంలో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్కుమార్, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భగవంతయ్య, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నారాయణపేట జిల్లాలో
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 28 : మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకుల కళాశాల లోప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పేట జిల్లాలో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,008 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 893 మంది పరీక్ష రాశా రు. 115 మంది గైర్హాజరయ్యారని డీఈవో అబ్దుల్గని, పరీక్షల కన్వీనర్ సుగుణశ్రీ తెలిపారు. పరీక్షా కేంద్రాలను పరీక్షల విభాగం అధికారి రమేశ్శెట్టి పరిశీలించారు. మొత్తంగా రెండు జిల్లాలో పరీక్ష లు సవ్యంగా సాగినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

