మహాలక్ష్మి అవస్థలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న ని బంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట కొట్లాటలు, మహిళల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
- స్టాప్ వద్ద మహిళలను చూసి బస్సులు నిలపని డ్రైవర్లు
- దూరంగా ఆపడంతో ఆడపడుచుల పరుగులు
- గంటల తరబడి తప్పని నిరీక్షణ
హన్వాడ, మే 21 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట కొట్లాటలు, మహిళల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బస్టాప్ వద్ద కాకుండా మరో దగ్గర బస్సులు ఆపుతుండడంతో మహిళలు పరుగులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలకేంద్రంలో ఉదయం 9 గంటల సమయంలో వివిధ గ్రా మాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దాదాపుగా 25 మంది మహిళలు బస్టాప్‌కు చేరుకున్నారు. నాలుగు బస్సులు రాగా.. మహిళలు చెయ్యెత్తినా రెండు ఆపకుం డా వెళ్లాయి.
మహిళలు ఉం డడంతో మరో రెండు బస్సుల డ్రైవర్లు స్టాప్ వద్ద కాకుం డా దూరంగా ఆపారు. దీం తో మహిళలు బస్సు ఆపిన చోటు వరకు పరుగులు పె ట్టారు. 1:30 గంటలు గడిచి నా ఒక్క బస్సు కూడా ఆప డం లేదని, తమను చూసి దూరంగా నిలుపుతున్నారని మహిళలు ఆరోపించారు. దీంతో విసుగు చెందిన ఆడపడుచులు రోడ్డుపైకి బస్సుకు అడ్డంగా వెళ్లారు. బస్సులు ఆపకపోతే గమ్యానికి చేరుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు. బస్సులు నిలపని డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

