మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. సీ ఎం రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం అమాయకులైన గిరిజనుల భూములను లా క్కోవడాన్ని నిరసిస్తూ వాళ్లంతా తిరగబడితే వారిపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫా ర్మా క్లస్టర్ రద్దు.. లగచర్ల బాధితులకు న్యాయం.. జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని.. అరెస్టులు ఆపాలని.. డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపా టు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇతర జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. లగచర్ల లడాయి పేరుతో జరిగే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా భారీ ఎత్తున గిరిజనులు, గిరిజన సంఘాలను ఏకం చేస్తూ ఈ ప్రదర్శన చేపడుతున్నారు.
దీని కోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గిరిజన నేతలతో సమావేశమయ్యారు. పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటినుంచే చేయాలని ఆ దేశించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లంబాడ సోదరులను ఏకం చేసేందు కు నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సీఎం సొంత జిల్లాలో లగచర్ల లడాయి నేపథ్యంలో ప్రభుత్వం అనుమతిస్తుందా.. నిరాకరిస్తుందా.. అనే ది సందేహాస్పదంగా మారింది. బాధితులకు బాసట గా నిలిచేందుకు నేతలు పిలుపునిస్తున్నారు.