నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/తిమ్మాజిపేట, సెప్టెంబర్ 14 : ‘పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్న గూడును చెదరగొడ్తావా..? రేవంత్‌రెడ్డి.. పాలమూరు బిడ్డను అంటూనే.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపి వారి పొట్ట కొట్టావు.. ఇండ్లను కూల్చడానికే నీవు ముఖ్యమంత్రివి అయ్యావా’..? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నేరెళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్.. పేదలంటే నీకు ఎందకంతా అలుసన్నారు.
సొంత జిల్లా అని చెప్పుకుంటూనే మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో 75 మంది దళితులు, పేదల ఇండ్లను కూల్చివేయించారని మండిపడ్డారు. 17 ఏండ్ల కిందట నాటి కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ హయాంలో పేదలకు స్థలాలు ఇచ్చారని తెలిపారు. ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇండ్లు కూలి ఎండకు.. వానకు బాధితులు ఎండుతూ.. తడుస్తుంటే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారికి చేయూతనిచ్చారని తెలిపారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా.. దయ లేకుండా.. ఏ కారణంతో ఇండ్లు కూలగొడ్తున్నారో తెలియజేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.
ఇప్పటికైనా చెంపలేసుకొని ఇండ్ల బాధితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలపై ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరులో 4 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించామని, అందులో ఇంకా 300 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కొన్ని బాధితులకు కేటాయించాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్, సంజయ్, అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెఢ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, బిగ్గాల గణేశ్‌గుప్తా, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్.. మీకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంటే పట్టదా..? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 90 నుంచి 95 శాతం పనులు పూర్తి చేస్తే.. కాంగ్రెస్ వచ్చిన పది నెలల్లో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పనులను పూర్తి చేసి సాగునీళ్లు పారిస్తే ప్రతి నీటి చుక్కలో కేసీఆర్‌ను రైతులు తలుచుకుంటారని, ఆయనకే మంచి పేరొస్తదనే వివక్ష చూపుతున్నారన్నారు. ఈ ఎత్తిపోతలపై చిత్తశుద్ధిని తెలియజేస్తామని చెప్పారు.
95 శాతం పనుల పూర్తయినట్లు ప్రజలకు వివరించేందుకు మేడిగడ్డ తరహాలో రెండ్రోజుల పాటు సందర్శిస్తామని స్పష్టంచేశారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకత్వమంతా కేసీఆర్ కట్టించిన రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లను ప్రజలకు చూపిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ముఖ్యమంత్రి కొడంగల్ ప్రాజెక్టుకు పైసలు ఖర్చు చేస్తూ.. పాలమూరు ఎత్తిపోతల పనులను ఎలా ఎండబెడుతున్నాడో ప్రజలకు వివరంగా తెలియజేస్తామని హెచ్చరించారు. భూములు ఇచ్చి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రైతులు, ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.