మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నాగ ర్‌కర్నూల్: నల్లమల్లలో గులాబీ గర్జించింది. కం దనూలులో కదం తొక్కింది. సీఎం సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభకు భారీ ఎత్తున పార్టీశ్రే ణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. కే వలం సర్పంచుల సన్మాన కార్యక్రమైనా.. పార్టీ కార్యాలయ ఆవరణలో ఇసుకేస్తే రాలనంత జ నం తరలివచ్చారు. కేటీఆర్‌ను చూసేందుకు దా దాపు మధ్యాహ్నం 12 గంటల నుంచే స్థానికులు వేచి ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కేటీఆర్ స్పీచ్ కొనసాగింది.
అంతకుముందు కే టీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఉయ్యాలవాడ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ సభా స్థ లానికి చేరుకునే సరికి దాదాపు రెండు గంటలు అయ్యింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బస్టాండ్ కూడలిలో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ గు లాబీ పూలతో ముంచెత్తారు. అనంతరం దారి పొడుగునా కార్యకర్తలు వెంట రాగా.. జై కేసీ ఆర్.. జై బీఆర్ఎస్.. జై కేటీఆర్ అన్న నినాదాలు హోరెత్తాయి. కేటీ ఆర్ ఓపెన్ టాప్ వెహికల్ పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

జనం జేజేలు, డీజే మోతల మధ్య ర్యాలీ సా గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎందుకు ఓడిపోయామో.. కార్యకర్తలకు వివరించారు. ‘ఇప్పుడు ఓన్లీ క్వార్టర్ ఫైనల్ అయింది.. ఇంకా సెమీ ఫైనల్ ఉంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు సాగాలి’ అంటూ పిలుపునిచ్చారు. కేటీఆర్ స్పీచ్‌కు ఫిదా అయిన జనం కేరింతలు, చప్పట్లతో ఉత్సాహపరిచారు. నాగర్‌కర్నూల్ మొత్తం గులాబీ పార్టీ పాటలు, గులాబీ రంగులో కనిపించింది. కేటీఆర్ వెంట మాజీ మ ంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపా ల్ యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ముఖ్య నాయకులు ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభకు జనం పోటె త్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేవలం గులాబీ మద్దతుతో గెలిచిన కొత్త సర్ప ంచులను మాత్రమే ఆహ్వానించారు. వారితో పా టు ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు రావాలని కోరితే.. గ్రామాల నుంచి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీలతో ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం రెండు న్నర గంటలు ర్యాలీలో పాల్గొని తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి భారీ ఎత్తున హాజరవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. సభ ఊ హించని రీతిలో విజయవంతమైంది. చాలా మందికి కుర్చీలు లేకపోవడంతో వాళ్లంతా బయ టే నిలబడి అభిమాన నేత కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపుతో భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది.

మాయమాటలు చెప్పి అధికార ంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పేదలు, బడుగులు, రై తుల బాగుకోసం ముందుచూపుతో పాలమూరు ప్రాజెక్టును నిర్మా ణం చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేసినా మిగిలిన కొద్దిపాటి పనులు చేయడంతో ప్రభుత్వం చేతులేత్తేసిందని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీటిని అందించేది మరిచి, ఆంధ్రాకు నీటిని తరలించేందుకు పూనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యే క రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడు భూములకు సైతం సాగునీటిని అందించేందుకు కేసీఆర్ కృషి చేయడంతో భూ ము ల ధరలకు రెక్కలొచ్చి రైతులందరూ సంతోషంతో ఉన్నారన్నారు.
ఎకరం పొలం మారుమూల ప్రాంతాల్లోనూ రూ. 50 లక్షల విలువ ఉండేదని, ప్రస్తుతం భూములకు ధరలు పూర్తిగా పడిపోయాయన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నీచమైన పాలనే నిదర్శనమన్నారు. వేల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేసే పనులను పక్కనపెట్టి దొడ్డిదారిన ఆంధ్రాకు సాగునీటిని మళ్లించే కుట్ర జరుగుతుందని, ఇంత జరుగుతున్నా జిల్లా వాడని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు చేసే దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుందన్నారు. కేసీఆర్ గ్రా మాలో మొక్కలు పెంచి అవార్డులు పొంది తే ప్రస్తుతం సీఎం తొండలను పెంచమని ప్రోత్సహిస్తున్నడని ఎద్దేవా చేశారు.
ఇద్దరి పరిపాలనలో ఎంత తేడా ఉందో గ్రామా ల్లో ప్రజలు గుర్తించాలని సూచించారు. ఏ సమావేశాల్లో చూసినా కేసీఆర్‌పైనే ఏడుపు ఉంటుందని, రైతులు బతకడానికి రైతుబంధు, 24గంటల వి ద్యుత్, రూ.2వేల పింఛన్ ఇచ్చినందుకా ప్రజలు ధనవంతులు కావడానికే ముందుచూపుతో ప్రాజెక్టుల నిర్మాణం చే స్తే జీర్ణించుకోలేక ఏ సమావేశంలో చూసినా అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. రైతులపై ఉన్న ప్రేమతో పాలమూరు 90 శాతం పూర్తిచేస్తే మిగిలిన పనులను ప్రభుత్వం చేయలేకపోతుందని విమర్శించారు. సాగునీరు అందితే రైతులు ఎక్కడ బాగుపడుతారనే చేయడం లేదన్నారు. గ్రామాల్లో ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీని, రాష్ర్టాన్ని నడిపించే నాయకుడు కేటీఆర్‌కు బయటకు వచ్చారని, ఇక నుంచి ప్రతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందన్నారు.