ఆర్డీఎస్ బాట.. నేడు ఆనకట్టకు బీఆర్ఎస్ బృందం
తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంది.
- ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పర్యటన
- తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక అక్రమ రిజర్వాయర్లు, బ్యారేజీల పరిశీలన
- త్వరలో భారీ ఉద్యమానికి శ్రీకారం
- రాజకీయ వేడిని రగిలిస్తున్న టూర్
మహబూబ్‌నగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంది. ఇటీవల ఏపీ కర్ణాటక తుంగభద్ర నదిపై అక్రమంగా సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల అక్రమ రిజర్వాయర్లు బ్రిడ్జికం బ్యారేజీలు నిర్మిస్తుండడంతో నడిగడ్డకు రావలసిన తుంగభద్ర జలాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్ర మాదం ఏర్పడింది.
ఆర్డీఎస్కు మరణ శాసనం రా స్తున్న ఈ రెండు రాష్ర్టాల చర్యలను ఎండగట్టేందుకు.. వాటిని అడ్డుకునేందుకు కావలసిన కార్యాచరణ రూపొందించడానికి ప్రతినిధి బృందం స్వయంగా ఆర్డీఎస్కు వెళ్లి పరిశీలించనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌తోపాటు పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. కర్ణాటక సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించి ఆ తర్వాత సమీపంలో ఏపీ నిర్మిస్తున్న ప్రతిపాదిత గుండ్రేవుల, కర్ణాటక చికల్పరివి రిజర్వాయర్ల ప్రతిపాదిత ప్రా ంతాలతోపాటు ఆర్డీఎస్కు నీళ్లు రాకుండా కుట్రలు పన్నుతున్న రెండు రాష్ర్టాల చర్యలను ఎండగట్టేందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.
ఈ మేరకు ఆర్డీఎస్ ఆనకట్టతోపాటు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలను కూడా సందర్శించి.. గద్వాలకు చేరుకుంటారు. అనంతరం తుంగభద్ర నది ఆర్డీఎస్ పరీవాహక ప్రాంతం.. నదీ జలాల లభ్యత.. రెండు రాష్ర్టాల అక్రమ ప్రాజెక్టులపై ప్రత్యేక కార్యాచరణలు రూపొందిస్తామన్నారు. ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పాదయాత్ర చేపడుతామని అల్టిమేట్ వేయడంతో సర్కార్లు కదలిక వచ్చింది. దీంతో ఆర్డీఎస్కు చుక్క నీరు అందకుండా చేస్తున్న పొరుగు రాష్ర్టాల జల దోపిడీపై నిలదీస్తామని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అడ్డుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈసారి తుంగభద్రతోపాటు కృష్ణ, భీమా నదులపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
వెలవెలబోతున్న ఆర్డీఎస్
అయిజ, జూలై 7 : కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ఆనకట్ట నీళ్లు లేక వెలవెల బోతున్నది. ఎగువన వరుణుడు కరుణించక పోవడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి పారుదల లేకపోవడంతో ఆనకట్ట అడుగంటుతున్నది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వలు తగ్గి డెడ్ స్టోరేజీకి చేరుకున్నదని ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తేనే నీటి చేరికతోనే జలకళ సంతరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

