కొల్లపూర్ రూరల్, ఏప్రిల్ 11 : వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు , ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే బీరం హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.
అనంతరం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.అనంతరం కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఫూలే చేసిన సేవలు కొనియాడారు. బీఆర్ఎస్ పట్టణ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే వెంట బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.