కొల్లాపూర్, ఏప్రిల్ 6: వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సైనికులు లక్షలాదిగా తలలి వెళ్దామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ పట్టణ, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో కొల్లాపూర్ పట్టణ, మండల ముఖ్యనేతలతో బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొల్లాపూర్ నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.