పాలమూరు, నవంబర్ 6 : మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరులో సోమవారం బీఆర్ఎ స్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గెలుపే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటు వేయాలని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యం లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామ ని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామాధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్, మన్యంకొండ ఆలయ కమిటీ సభ్యుడు చిన్నయ్యగౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హన్వాడ, నవంబర్ 6 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా సోమవారం మండలంలోని అన్ని గ్రా మాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరు గా ఇంటింటా ప్రచారాలు చేపట్టారు. కారు గుర్తు కు ఓటు వేసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 6 : జిల్లా కేం ద్రంలోని 46వ వార్డు కొత్తగంజ్‌లో సోమవారం మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటిగణేశ్ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, మ హబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, అ నంతరెడ్డి, కట్టారవికిషన్‌రెడ్డి, వనజా, ప్రవీణ్ హనీఫ్‌అహ్మద్, మహ్మద్ఇక్బాల్, వహెద్తాజ్, నూరుల్ హాసన్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, నవంబర్ 6 : అభివృద్ధికి అండగా నిలిచి మరోసారి పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మహ్మదాబాద్, సంగాయిపల్లి, ముందలి తండాల్లో బీఆర్ఎస్ శ్రే ణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అదేవిధంగా మండలంలోని జూలపల్లిలో సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, దేశాయిపల్లిలో సర్పంచ్ రాఘవేందర్, కొలిమిక్చుతండాలో సర్పంచ్ బాలాజీ, కం చన్పల్లిలో సర్పంచ్ అంజిలయ్య, మంగంపేట్తండాలో గీతాబాయి ఆధ్వర్యంలో ఇంటింటి ప్ర చారం చేసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిస్తున్నారు. కార్యక్రమా ల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు రాజేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, రాజుగౌడ్, అశోక్‌రెడ్డి, సాబే ర్, సత్యం, నరేశ్, బాలరాజు, శ్రీను పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 6 : రాష్ర్టాన్ని అభివృద్ధి ప థంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిని అన్నారు. మండలంలోని నందారం లో సోమవారం వైస్ ఎంపీపీ వెంకటాచారితో కలి సి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మం డలంలోని బోడజానంపేటలో బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు బాలయ్య ఆధ్వర్యంలో ప్రచా రం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర నా యకుడు లక్ష్మణ్‌నాయక్, జగన్ నాయక్, వైస్ ఎంపీ పీ వెంకటాచారి, సర్పంచ్ నిర్మలా, సింగిల్ విండో డై రెక్టర్ మంజూనాయక్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సోమ్లానాయక్, నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని వైస్ ఎంపీపీ వెంకటాచారి అన్నారు. మండలంలోని నేరళ్లపల్లి, నందారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమవారం మండ ల కేంద్రంలో వైస్ ఎంపీపీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ రజిని, సర్పం చ్ నిర్మాలా, లక్ష్మణ్‌నాయక్, జగన్నాయక్, మం జూనాయక్, సోమ్లానాయక్, మల్లేశ్, రవిజాదవ్, గణేశ్‌గౌడ్, నరేందర్ పాల్గొన్నారు.
జడ్చర్ల/జడ్చర్లటౌన్, నవంబర్ 6 : జడ్చర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్య ర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తరఫున సోమవారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యా నిఫెస్టోను ప్రజలకు వివరించారు. మండలంలోని కొండెడు, పెద్దఆదిరాల, కోడ్గల్, గ్రామాల్లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. మాటుబండతండాలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్ ఆధ్వర్యంలో, మాచారంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశా రు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో సంజీవయ్యకాలనీలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రమేశ్, ఇంతియాజ్‌ఖాన్, దీపక్‌రాథోడ్, వీరేశ్, కురుమయ్య, అమర్నాథ్రెడ్డి, శంకర్‌నాయక్, కౌన్సిలర్ కోనేటి పుష్పలత, నర్సింహులు, పరమటయ్య, జేకే న ర్సింహులు, సత్యం, ప్రభు, అజహర్ ఉన్నారు.
రాజాపూర్, నవంబర్ 6 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, జెడ్పీటీసీ మోహన్నాయ క్ అన్నారు. సోమవారం మండలంలోని కుచ్చర్కల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి కీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ అభిమాన్యురెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం, సర్పంచ్ సుధారాణి, వెంకటయ్యగౌ డ్, వెంకటేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.
గండీడ్, నవంబర్ 6 : మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ చెవుల చంద్రయ్య, నాయకులు వెంకటయ్య, చంద్రయ్య గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల సంఘం ఉమ్మడి మండలాధ్యక్షుడు గోపాల్, మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.