అచ్చంపేట, సెప్టెంబర్ 29 : ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్కడ చూసినా జనగర్జన గురి ంచే చర్చ జరుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగానికి జనం ఫిదా అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ హ యాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలరాజు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన క్యాడర్లో భరోసా నింపారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి కేసీఆర్ అచ్చంపేట నియోజకవర్గాన్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్ప గించగా.. సమర్థవంతంగా పనిచేస్తూ పార్టీ క్యాడర్‌కు అండగా నిలించారు. వారి లో మరింత ధైర్యం నింపేందుకు జనగర్జనను నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం హాజరై కార్యకర్తలకు వెన్నంటే ఉంటామని కొండంత ధైర్యాన్ని కల్పించారు.
అచ్చంపేట నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. పార్టీకి, క్యాడర్లో కొండంత ధైర్యం నింపారు. తర్వాత నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, నాయకులు హైదరాబాద్ వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. అచ్చంపేటలో సభ నిర్వహిస్తాం రావాలని కలిసి విన్నవించారు. తప్పకుండా అచ్చంపేట ప్రజలు, క్యాడర్‌కు పార్టీ అండగా ఉంటుందని 28న అచ్చంపేటకు వస్తానని కేటీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ సభను సక్సెస్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే మర్రి బాధ్యతలు తీసుకొని అన్నిమండలాలను సమన్వయం చేస్తూ ముందుకు నడిపించారు. మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి సైతం సహకారం అందించారు.
కేటీఆర్ సభను సక్సెస్ చేసేందుకు మర్రి జనార్దన్‌రెడ్డి వారంరోజులు పాటు తీవ్రంగా శ్రమించారు. స్థానిక నేతలు పోకల మనోహర్, నర్సింహాగౌడ్, అమినొద్దీన్, తులసీరాం, పర్వతాలు, కౌన్సిలర్లను ఉత్సహ పరుస్తూ లింగాల, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, అచ్చ ంపేట, వంగూరు, చారకొండ మండలాల ముఖ్యనేతలు, మాజీ సర్పంచులు, నాయకులతో నేరుగా మాట్లాడుతూ సమన్వయం చేస్తూ సభ విజయవంతం చేసి సఫలీకృతం కాగలిగారు. సభకు ముందు నాలుగు రోజుల పాటు వర్షం ఇబ్బంది కల్గించినా సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బంది కావొద్దని జర్మనీ రెయిన్‌ఫ్రూఫ్ టెంట్లు వేయించారు. వర్షం వస్తుంది జనం సభకు వస్తారా? రారా? అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నట్టుండి సభ రోజు వర్షం రాకపోవడం సాయంత్రం కేటీఆర్ ప్రసంగిస్తుండగా వర్షం అలా వచ్చి ఇలా వెళ్లింది. వర్షం కూడా సభకు అంతరాయం లేకుండా సహకారం అందించిందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే సభా ప్రారంభం కాకముందే 11 గంటలకు జనం రావడం ప్రారంభమైంది. కే టీఆర్ నాలుగు గంటలు ఆలస్యంగా సభకు చేరుకున్నా జనం కిక్కిరిసిపోయారు. సభ వేదిక వద్ద, రోడ్లపై పెద్దసంఖ్యలో జనం కనిపించారు. తక్కువ సమయంలో ఇంతపెద్దసంఖ్యలో జనం తరలిరావడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని క్యాడర్లో మరింతో జోష్ నింపింది.
ఇన్ని రోజులు నాయకుడు లేడని మదనపడ్డ క్యాడర్‌కు కేటీఆర్ సభకు వచ్చిన జనం చూసిన తర్వాత పార్టీ శ్రేణు ల్లో మనోధైర్యం పెరిగింది. దాదాపు 15వేల నుంచి 20వేల వరకు ప్రజలు వచ్చిఉంటారని భావిస్తున్నారు. కేటీఆర్ ప్రసంగం జనాలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ చేసిన మోసాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో ఈ సభ జరగడం బీఆర్ఎస్ పార్టీకి బలాన్ని పెంచింది. స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం నింపింది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి కనిపించకపోవడంతో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. కేటీఆర్ సభ అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి, క్యాడర్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. సభా వేదిక స్థలం సరిపోకపోవడంతో జనం మిద్దెలు ఎక్కి సభను తిలకించారు. సోమవారం పట్టణంలో ఎక్కడ చూసినా జనం సభ గురించే చర్చించుకుంటున్నారు. సభ ఎలా జరిగింది, ఎంత మంది వచ్చారు, సక్సెస్ అయింది అంటూ చర్చించుకుంటున్నారు. ఈ సభ ద్వారా నాయకుడు లేని లోటు ఎక్కడా కనిపించలేదు. సభ సక్సెస్ కావడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, స్థానిక నేతలు ఆనందం వ్యక్తం చేశారు.