వనపర్తి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : పల్లె, పట్నంలో గులాబీ సందడి నెలకొన్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు నాయకులు సేనను సంసిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో జోరుగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల నాయకులు సైతం కారెక్కుతున్నారు. దీంతో రోజురోజుకూ కేసీఆర్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతున్నది.
పట్టణాలు, గ్రామాల్లో గులాబీ సైన్యం స్థానిక పోరుపై కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గడచిన రెండేళ్లుగా ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు బీఆర్ఎస్ బాసటగా నిలుస్తున్నది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎని ్నకలపై ప్రభుత్వం నజర్ పెడుతున్నందున గులాబీ సైన్యం సహితం అప్రమత్తమైంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చి న హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. పథకాలు అనేక మంది అర్హులకు అందక పోవడం వల్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. ఈక్రమంలో గ్రామాలు, పట్టణాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. కొందరు బాహటంగానే ప్రభుత్వ తప్పిదాలను వెల్లడిస్తుండగా మరికొందరు సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపెడతామన్న తరహాలో గుట్టుగా ఉన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లోకి వెళ్తున్నది.
నెలరోజుల నుంచి అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ, మండల నాయకత్వాలు సమిష్టిగా కలియ తిరుగుతు జనంలోకి వెళుతున్నారు. గడచిన పదేండ్లలో బీఆర్ఎస్ పాలన సాగిన తీరును గమనించిన ప్రజలు, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా సాగిందో కూడా పసిగట్టారు. బీఆర్ఎస్ బృందాలను చూస్తున్న జనం వారి సమస్యలను, ప్రభు త్వ తప్పిదాలను వెల్లడి చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నా రు. మొదటి దశలో ఇప్పటికే నియోజకవర్గంలోని పెబ్బే రు, గోపాల్పేట, పెద్దమందడి, ఖిల్లాఘణపురం, రేవళ్లి, శ్రీరంగాపురం మండల గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలుస్తు మీకు మేం ఉన్నామంటు భరోసా కల్పిస్తున్నారు. వనపర్తి మున్సిపల్ కాలనీల్లోనూ పట్టణ బీఆర్ఎస్ నాయకులు జనంలోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటున్నారు.
పక్షం రోజులుగా బీఆర్ఎస్ గ్రామాల బాట పట్టింది. గ్రామాల్లోని ప్రధాన కాలనీలు, జన సంచారం ఉండే కూడళ్లకు బీఆర్ఎస్ బృందాలు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సమూహాల్లో అన్ని పార్టీలకు చెందిన వారు సహితం కొన్నిచోట ్లతారస పడుతున్నారు. చర్చల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పనితీరును చర్చించే క్రమంలో కాంగ్రెస్ పేరు ఎత్తకండని దండం పెట్టి మరి చెబుతుండటంపై గులాబీ శ్రేణులు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
గతంలో అమలు చేసిన పథకాలను నిలిపి వేయడం, కొన్నింటిని అమలు చేసినా అరకొరగా చేసి అయింది అనిపించడంతో జనంలో వ్యతిరేకత పెల్లుబికుతున్నది. ఏ పథకం చూసినా.. ఏమున్నది అసంతృప్తుల పుట్టలే అన్నట్లుగా కనిపిస్తుంది. చెప్పేదొకటి.. చేసేదొకటి అనే పంథాలో వేలాది మందికి పథకాలు దూరమయ్యాయి. అర్హత ఉండి కూడా పథకాలు అందని వారిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగానే కనిపిస్తుంది. ఇదంతా స్థానిక సమరంలో అధికార కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ శ్రేణులకు మా జీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో అన్ని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక స మావేశాలను నిర్వహించి అప్రమత్తం చేశారు. ప్రధానంగా రెం డేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ప్రజల్లో గూడు కట్టుకుని ఉందని, దీనిపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. అనంతరం పట్ట ణ, మండల నాయకత్వాల పరిధిలో గ్రామ, వార్డుల నాయకత్వాలు కార్యకర్తలను సమీకరించి జనంలోకి వెళ్లి చర్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనతోపాటు ప్రస్తుత పాలనను బేరీజు వేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను ప్రకటించి సింగిరెడ్డి అమలు చేస్తున్నారు.
బీఆర్ఎస్లోకి మళ్లీ చేరికలు షురూ అయ్యాయి. గతంలో బీఆర్ఎస్లో ఉండి చిన్నచిన్న మనస్పర్థలతో పార్టీని వీడిన నాయకులు, కార్యకర్తలు కొందరైతే, బీఆర్ఎస్లో లేని వారు సహితం గులాబీ పార్టీలోకి చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వెళ్లిన క్యాడర్ తిరిగి వచ్చేందుకు ఆరాట పడుతున్నారు. బీఆర్ఎస్ను వీడి వెళ్లిన వారంతా రెండేళ్లుగా నిరుత్సాహంతోనే ఉన్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఏ ఒక్క పని కాకపోవడం.. పథకాలను సహితం సక్రమంగా అందించలేని పరిస్థితి ఉన్నందునా గ్రామాల్లో మొఖం చూపాలంటేనే ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి పథకానికి తూట్లు పొడవడంతో గ్రామాల్లో అడిగే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి అధికార పార్టీ నాయకులకు ఎదురవుతున్నది. ఇక దాదాపు రెండేళ్లు కాంగ్రెస్ పాలన ముగుస్తున్న క్రమంలో వచ్చే మూడేళ్లలోనూ ఇంతకంటే అధ్వాన్నంగా పాలన ఉం టుందన్నట్లుగా మదనపడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలకు తాము చేయగలిగిందేమీ లేదన్నట్లు మళ్లీ గులా బీ గూటికి చేరేందుకు నాయకులు, కార్యకర్తలు ఆసక్తి కనబరుస్తున్నారు.