హన్వాడ మే 22 : హన్వాడ, టంకర, గుడిమల్కాపురం రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు హన్వాడ చెరువుకట్టపై రోడ్డును పరిశీలించి, రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ కొండ లక్ష్మయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హన్వాడ,టంకర,గుడిమల్కాపురం గ్రామాలను కలుపుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషితో బీడీ రోడ్డు కోసం ఏడు కోట్లు నిధులు మంజూరు చేయగా నేటి వరకు కూడా పనులు పూర్తి చేయడం లేదని ఆరోపించారు.
వెంటనే రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతుందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, బసిరెడ్డి, మాధవులు పాల్గొన్నారు.