అచ్చంపేటటౌన్, మార్చి 14 : మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై అసెంబ్లీలో విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మేరకు శుక్రవారం అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అమీనొద్దీన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎండగడతాడనే ఉద్దేశంతో అనని మాటలు అన్నట్లు చూపించి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రమేశ్‌రావు, నాయకులు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.