నెట్వర్క్ మహబూబ్‌నగర్, మార్చి 14 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. శాసన సభ నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికింది. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకొని.. అరెస్టు చేశారు.
అయినా ఆయా నియోజకవర్గాల్లోని కూడళ్ల వద్దకు గులాబీ పార్టీ శ్రేణులు
పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనలు కొనసాగించారు. గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, అచ్చంపేట,
కొల్లాపూర్ పట్టణాల్లో ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ
ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
15 నెలలుగా ప్రభుత్వంపై ప్రజల తరుపున ఆరె గ్యారెంటీల విషయమై పోరాటం చేస్తున్న.. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.