మహ్మదాబాద్/హన్వాడ/మదనాపురం/ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 8 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కడం నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటున్నది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్, హన్వాడ మండల కేంద్రాల్లో రైతులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. మహ్మదాబాద్‌లోని ఓ ఫర్టిలైజర్ షాపునకు యూరియా లోడ్ రాగా.. విషయం తెలుసుకొన్న రైతులు అర్ధరాత్రి దుకాణం వద్దకు చేరుకొని నిద్రాహారాలు మానుకొని పడిగాపులు కాశారు. అయితే కొందరికే యూరియా అందడంతో మిగితా వారు రోడ్డుపైకి చేరి ఆందోళనకు దిగారు. దాదాపు 3 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో విషయం తెలుసుకొన్న ఎస్సై శేఖర్‌రెడ్డి రైతులను సముదాయించారు.
అధికారులతో మాట్లాడి యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే హన్వాడ మండల కేంద్రంలోని తాండూర్-మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై రెండున్నర గంటలసేపు రైతులు రాస్తారోకో చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. పంటకు సరైన సమయంలో యూరియా వే యకుంటే పంట దిగుబడి ఎక్కువగా రాదన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వానికి రాబోయే రోజు ల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. విషయం తెలుసుకొన్న హన్వాడ ఎస్సై వెంకటేశ్‌తోపాటు సి బ్బందికి అక్కడికి చేరుకొని వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. ఎస్సైతో నా యకులు వాగ్వాదానికి ది గారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తు ంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు సోమవారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ సబ్ సెంటర్‌ను ముట్టడించారు. వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ధర్నా నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సరిపడా యూరియా తెప్పించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో రైతులకు యూరియా అందించామన్నారు. ఇప్పటికైనా యూరియా సమ స్య తీర్చకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హె చ్చరించారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రం లో రైతులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నా యకులు ఒకవైపు టోకెన్లు ఇచ్చి మరోవైపు లారీలు వచ్చిన వెంటనే వాటిని గుట్టుచప్పుడు కాకుండా యూరియాను అధికార పార్టీ నాయకులకు అందజేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రైతులకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.