మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 24 : అడ్డాకుల మండలం శాఖాపూర్ శివారులోని పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం అలుగు పారుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో శాఖాపూర్ శివారులోని కందూరు స్టేజీ వద్ద రూ.5 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యాం అలుగు పారింది. దీంతో రైతులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు శనివారం అక్కడకు చేరుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలు చెక్‌డ్యాంలో పాతి జై కేసీఆర్, జై ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు.