వనపర్తి /వనపర్తి టౌన్, నవంబర్ 3 : ఎన్నికల సమయంలో విజన్‌లేని నాయకులు వస్తుంటారు.. వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్, ఎకో పార్కు, వ్యాపార సముదాయాలు, 27వవార్డులో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికారప్రతినిధి వాకిటి శ్రీధర్, 27 వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మతో కలిసి శుక్రవారం ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ వందేండ్ల భవిష్యత్ లక్ష్యంగా నియోజకవర్గానికి పునాదులు వేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వనపర్తిని దేశంలో వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ధ్యేయమన్నారు. ఇప్పటికే అనేక ఉన్నత కళాశాలలను నియోజకవర్గానికి తీసుకొచ్చామని, మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకాగానే పశువైద్యకళా శాల ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టుకుందామన్నారు. నియోజవర్గంలో జరిగిన అభివృద్ధిని గు ర్తిం చి మరోసారి తోడుగా నిలివాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. వనపర్తి ప్రజల మనస్సులో నిండుగా బీఆర్ఎస్ ఉంద ని, వారి ఆత్మీయ పలుకే బీఆర్ఎస్ విజయానికి నాంది అని మంత్రి అన్నారు. అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్‌తో మాట్లాడి, కొంత సేపు షటిల్ ఆడారు. అనంతరం రోడ్డు మార్గంలో టీ స్టాల్ వద్ద ఆగి కార్యకర్తలు, ప్రజలతో కలిసి టీ తాగారు. అదేవిధంగా ఏకో పార్కులో కూడా వాకర్స్‌తో వాకింగ్, ఓపెన్ జిమ్‌లో కొంతసేపు వ్యాయామం చేశారు. బీఆర్ఎస్లో చేరిన బీకే తండావాసులు పట్టణ సమీపంలోని బీకే తండాకు చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ బాబునాయక్ ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వనపర్తి, నవంబర్ 3: జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నాగవరం రోడ్డు మార్గంలోని భగీరథ విగ్రహం మొదలుకొని వివేకానం ద చౌరస్తా, బస్టాండ్ వరకు ఎన్నికల ప్రచారాన్ని బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఇతర నా యకు లతో కలిసి నిర్వహిం చారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లే పరి స్థితుల నుంచి ఈప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు మెరుగుప ర్చుకొనే పరిస్థితికి మనం వచ్చామన్నారు. అంతకు ముందు మంత్రి నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు మార్గంలోని మటన్ దుకాణంలోకి వెళ్లి కొంత సేపు మటన్ కోసం వచ్చిన వారికి మటన్ కొట్టించి, కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
వనపర్తి,నవంబర్ 3: బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో దాసరి జిల్లా అధ్యక్షుడు దాసరి పెద్దరాముడు ఆధ్వర్యంలో పెబ్బేరు, గోపాల్పేట మండలాలకు చెందిన హోలియాదాసరి కులస్తులు, వనపర్తి పట్టణ మహిళా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు మొత్తం 200మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలను చూసి ఎక్కువ మంది గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. అనంతరం టైలర్స్ అసోసిషేయన్ మహిళలు మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మంత్రికి మద్దతు తెలుపుతున్నామన్నా రు. ఎన్నికలో మంత్రి నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం ప్రతి వార్డులో ప్రచారం నిర్వహించి అత్యధికంగా మహిళల ఓట్లు వేయిస్తామన్నారు.
గోపాల్పేట, నవంబర్ 3 : రేవల్లి మండలంలోని బండరావిపాకుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీకి చెందిన 50మంది శుక్రవారం జిల్లాకేంద్రంలోని మంత్రి నివాసంలో మంత్రి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్లో చేరినట్లు వారు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నిరంజన్‌రెడ్డిని మరో సారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో పూర్ణకంటి శివ, రాములు, మహేంద్రనాథ్, రాములు, సైదులు, లక్ష్మణ్, కురుమయ్య, రమేశ్, శివకుమార్, భా స్కర్, సురేశ్, సురేందర్‌రెడ్డి, పరశురాములు, శివయ్య, దొడ్డి రాములు, శేఖర్, నాగయ్య ఉన్నారు. కార్యక్రమం లో వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, జలగం నారాయ ణ, మిద్దె శ్రీరాములు, గంగసాని రాజవర్ధన్‌రెడ్డి, సలేశ్వరం, మిద్దె రవి, మిద్దె నర్సింహ, ఉత్తస్వామి ఉన్నారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలు స రమేశ్‌గౌడ్, పట్టణ ఎన్నికల సమన్వయ కర్త అరు ణ్ప్రకాశ్, ఆర్టీఏ డైరెక్టర్ ఆవుల రమేశ్, మీడియా సెల్ కన్వీనర్లు నందిమళ్ల, శ్యాం, అశోక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, జిల్లా సీనియర్ నాయ కులు రాములు యాదవ్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, మహేశ్, పాకనాటి కృష్ణ, కంచెరవి, సమద్, జంపన్న, నారాయణ, కృష్ణ ,నాగన్నయాదవ్, భాష్యనాయక్, పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చై ర్మన్ గౌని బుచ్చిరెడ్డి, నాయకులు కోళ్ల వెంకటేశ్, బీ చుపల్లియాదవ్, రవిచారి, గోనెల సహదేవుడు, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మురళి, రవి, బీరయ్య, ఇమ్రాన్, జహంగీర్, తిరుమల్, కృష్ణ, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, బీచుపల్లి, మునీకు మార్, సుభాశ్, సంతోష్,రాము,శివ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నా రు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. రామాలయం కాలనీ మహిళలు తమ ఇంటికి రావాలని కోరడంతో మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి పలకరించారు ఆ సమయంలో అక్కడ కనిపించిన నమస్తే తెలంగాణ దినపత్రికను చదువుతూ కనిపించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం మర్రికుంట కాలనీవాసులందరూ కారు గుర్తుకు ఓటు వేస్తామని మంత్రితో ముక్తకంఠంతో చెప్పారు..